నిన్న మొన్నటి వరకు బీజేపీ(BJP)ని విపరీతంగా తిట్టిపోసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌(Telangana CM KCR) ఇప్పుడు కాంగ్రెస్‌(Congress)ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అందుకు కారణం తెలంగాణలో కాంగ్రెస్‌ రోజురోజుకీ బలపడుతోందన్న సంకేతాలు రావడం. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ప్రధాన శత్రువు బీజేపీనే అయ్యింది.

నిన్న మొన్నటి వరకు బీజేపీ(BJP)ని విపరీతంగా తిట్టిపోసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌(Telangana CM KCR) ఇప్పుడు కాంగ్రెస్‌(Congress)ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అందుకు కారణం తెలంగాణలో కాంగ్రెస్‌ రోజురోజుకీ బలపడుతోందన్న సంకేతాలు రావడం. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ప్రధాన శత్రువు బీజేపీనే అయ్యింది. క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఉన్న బలాబలాలేమిటో కేసీఆర్‌కు బాగా తెలుసు. అందుకే విలేకరుల సమావేశంలో అయినా, బహిరంగ సభల్లో అయినా కేసీఆర్‌ కమలం పార్టీపైనే కత్తులు దూసేవారు. ప్రసంగాన్ని బీజేపీ తిట్లదండకంతోనే మొదలు పెట్టేవారు. అలా కేసీఆర్‌కు అలవాటయ్యింది. ఇప్పుడు ఆ అలవాటు నుంచి బయటపట్టారు. నిన్న నిర్మల్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించిన కేసీఆర్‌ తర్వాత జరిగిన సభలో అనర్గళంగా మాట్లాడారు. ఇందులో ప్రధాన ఫోకస్‌ అంతా కాంగ్రెస్‌ మీదనే పెట్టారు. బీజేపీ గురించి మాట్లాడింది చాలా తక్కువ. తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను తొలగిస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెప్పడాన్ని కేసీఆర్‌ అస్త్రంగా మల్చుకున్నారు. ధరణి పోర్టల్‌ వద్దంటున్న కాంగ్రెస్‌ నేతలను బంగాళాఖాతంలో కలిపేయాలని కేసీఆర్‌ అన్నారు.

నిర్మల్ కలెక్టరేట్ ను ప్రారంభించిన తర్వాత జరిగిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా టార్గెట్ చేశారు. సభాముఖంగా ప్రసంగం మొదలు పెడితే చాలు.. కమలదళం మీద నిప్పులు చెరగడం కొన్నేళ్లుగా ‘డిఫాల్ట్’ అలవాటుగా మార్చుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. తాజా సభలో మెయిన్ ఫోకస్ మొత్తం కాంగ్రెసు మీదనే పెట్టారు. బిజెపి ప్రస్తావనే తక్కువ. ధరణి పోర్టల్ వద్దంటున్న కాంగ్రెసు నాయకులను బంగాళాఖాతంలో కలిపేయాలని కూడా కేసీఆర్ ఆకాంక్షించారు. అధికారుల వేధింపులకు తావు లేకుండా చేసిన ధరణి పోర్టల్‌ను తీసేస్తే మళ్లీ దళారీ వ్యవస్థ చేతిలో నానా కష్టాలు పడాల్సి ఉంటుందని కేసీఆర్‌ హెచ్చరించారు. 60 ఏండ్లు దేశాన్ని ఏలి మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయిన దుర్మార్గులకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే రైతుబంధును, దళిత బంధును కూడా రద్దు చేస్తారని కేసీఆర్‌ చెప్పారు. మళ్లీ ఈ దుర్మార్గులు వస్తే కరెంట్‌ పోతుంది. అని అన్నారు. కేసీఆర్‌ ఉద్దేశంలో దుర్మార్గులు అంటే కాంగ్రెస్‌ వారన్న మాట! కేసీఆర్‌ తీరు చూస్తుంటే బీజేపీ కంటే కాంగ్రెస్‌ అంటేనే ఆయన ఎక్కువ భయపడుతున్నట్టుగా అనిపిస్తోంది. మూడునాలుగు నెలలుగా కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. అదే సమయంలో కర్ణాటకలో సాధించిన ఘన విజయం ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపింది. పొరుగునే ఉంది కాబట్టి కర్ణాటక విక్టరీ తెలంగాణ కాంగ్రెస్‌కు జీవన్‌టోన్‌ టానిక్‌లా పని చేయవచ్చనే భావన కేసీఆర్‌కు వచ్చి ఉంటుంది. అదే సమయంలో కాంగ్రెస్ పట్ల ప్రజలలో సానుకూల ఆలోచన పెరుగుతుందన్న అభిప్రాయమూ కేసీఆర్‌కు కలిగిఉంటుంది. అందుకే కేసీఆర్‌ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. మొన్నటి వరకు తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని బీజేపీ పదే పదే చెబుతూ వచ్చింది. బాగా హడావుడి చేసింది. చేరికల కోసం ఓ కమిటీనే వేసింది. ఫలానా వారు పార్టీలోకి వచ్చేస్తున్నారంటూ ప్రకటనలు చేసింది. ఇందులో ఏ ఒక్కటి వర్కవుట్‌ కాలేదు. ఇప్పటి వరకు ఏ ప్రముఖ నాయకుడు బీజేపీలో చేరింది లేదు. ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. మహా అయితే ఓ ఆరు నెలలు అంతే! ఈ సమయంలోనే బీజేపీ బలహీనతలు బయటపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సంస్థాగత నిర్మాణం లేకపోవడం, అన్నిచోట్ల పార్టీకి బలం లేకపోవడం, నియోజకవర్గానికి బలమైన నాయకుడు లేకపోవడం, నేతల మధ్య విభేదాలు ఉండటం .. ఇవన్నీ బీజేపీ మైనస్సులే! కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు లేవని కాదు కానీ ఆ పార్టీకి గ్రామీణ ప్రాంతాలలో చాలా ఓటు బ్యాంకు ఉంది. ఆ బలాన్ని కాంగ్రెస్‌ గమనించలేకపోతున్నది. పైగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పుంజుకుంటున్నది. భారత్‌ జోడో యాత్ర తర్వాత రాహుల్‌ ఇమేజ్‌ పెరిగింది. ప్రత్యామ్నాయాన్ని కోరుకునే వారు పెరుగుతున్నారు. ఇవన్నీ గమనించే తనకు బీజేపీ కంటే కాంగ్రెస్‌ పార్టీనే ఎక్కువ ప్రమాదకారి అని కేసీఆర్‌ భావించారు. అందుకే కాంగ్రెస్‌పై ఘాటైన విమర్శలు చేస్తున్నారు.

Updated On 4 Jun 2023 11:59 PM GMT
Ehatv

Ehatv

Next Story