ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ కార్య‌క్ర‌మంలో క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తో పాటు మంత్రులు మహమూద్ అలి, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్(World Boxing Champion) నిఖత్ జరీన్(Nikhat Zareen) సచివాలయంలో సీఎం కేసీఆర్‌(CM KCR)తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ కార్య‌క్ర‌మంలో క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్(V Srinivas Goud) తో పాటు మంత్రులు మహమూద్ అలి(Mohammad Ali), ప్రశాంత్ రెడ్డి(Prashanth Reddy), మల్లారెడ్డి(Mallareddy) తదితరులు పాల్గొన్నారు. అనంత‌రం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాబోయే ఒలింపిక్స్(Olympics) క్రీడల్లో స్వర్ణం సాధించి తెలంగాణ సహా భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాబోయే ఒలంపిక్ పోటీల్లో పాల్గొనేందుకు నిఖత్ జరీన్ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందచేస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఒలంపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు తీసుకునే శిక్షణ, కోచింగ్, రవాణా తదితర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అందుకు సంబంధించిన ఖర్చుల కోసం రూ. 2 కోట్లను సీఎం ప్రకటించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(Shanti Kumari)ని చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Updated On 18 May 2023 8:53 PM GMT
Yagnik

Yagnik

Next Story