రాష్ట్రంలోని దివ్యాంగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం వారికి ఇస్తున్న పెన్షన్‌ను రూ.1000 పెంచుతూ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. దీంతో దివ్యాంగులకు ప్రస్తుతం రూ.3116 పెన్షన్ ఇస్తుండగా.. వచ్చే నెల నుంచి రూ.4116కు పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ మంచిర్యాల బహిరంగ సభ వేదికగా ప్రకటించారు.

Telangana CM KCR announces hike in pension for the physically challenged
రాష్ట్రంలోని దివ్యాంగుల(Disabled)కు సీఎం కేసీఆర్(CM KCR) శుభవార్త చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం వారికి ఇస్తున్న పెన్షన్(Pension)ను రూ.1000 పెంచుతూ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. దీంతో దివ్యాంగులకు ప్రస్తుతం రూ.3116 పెన్షన్ ఇస్తుండగా.. వచ్చే నెల నుంచి రూ.4116కు పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ మంచిర్యాల(Mancherial) బహిరంగ సభ(Public Meeting) వేదికగా ప్రకటించారు. పెంచిన పెన్షన్ వచ్చే నెల నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. దేశాన్ని, రాష్ట్రాన్ని 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్(Congress).. ఏ ఒక్కరికీ మంచి చేయలేదని, ఎన్నికలు రానుండటంతో కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి వివక్ష లేకుండా అందరి సంక్షేమం కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం(BRS Govt) పనిచేస్తున్నదని చెప్పారు. మన ప్రభుత్వంలో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నేడు అంతా సంక్షేమమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని చెప్తుంది. కాంగ్రెస్‌కు అవకాశమిస్తే తెలంగాణలో మళ్లీ దళారీల రాజ్యం, పైరవీకారుల రాజ్యం, పైసలు గుంజేటోళ్ల రాజ్యం వస్తదని అన్నారు. కాంగ్రెస్ ధరణి(Dharani)ని తీసేస్తే మళ్లీ వీఆర్వోలు, పట్వారీల రాజ్యం వస్తుంది. ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామంటున్నకాంగ్రెస్‌నే గిరగిరా తిప్పి బంగాళాఖాతం(Bay of Bengal) లో పడెయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
