మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై రేవంత్ స్పెషల్ సర్వే చేశారని తెలుస్తోంది.
మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై రేవంత్ స్పెషల్ సర్వే చేశారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇద్దరు మంత్రుల పనితీరుపై రేవంత్‌రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ, ఎక్సైజ్‌శాఖ మంత్రి కృష్ణారావు పనితీరుపై జనం తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. పనితీరు బాగాలేకపోవడంతో వీరిద్దరినీ తప్పించే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలపై కూడా ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై సీల్డ్ కవర్‌లో సీఎం రేవంత్‌కు నివేదికలు అందినట్లు తెలుస్తోంది. పనితీరు మార్చుకోవాలంటూ సర్వే రిపోర్ట్ సీల్డ్ కవర్‌లో ఉంచి రేవంత్ హితబోధ చేశారని సమాచారం.
మరోవైపు తనను కలిసిన ఉద్యోగులతో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఉద్యోగులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే బాగున్నారు.. తెలంగాణ వచ్చాకే ఎక్కువ నష్టపోయామని వాపోయారట. వస్తున్న ఆదాయం సరిపోవడం లేదు.. అవసరానికి కావాల్సిన ఆదాయంలో ప్రతినెలా రూ. 4వేల కోట్లు తక్కువ వస్తున్నాయన్నారట. ఆర్థిక ఇబ్బందుల వల్లే కొన్ని సమస్యలను పరిష్కరించలేకపోతున్నాం. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వారిని రెగ్యులరైజ్ చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితి నెలకొంది ఉందని ఉద్యోగులతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారని తెలుస్తోంది.