కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోసారి అసెంబ్లీ సమావేశాలు(Assembly sessions) రేపటి నుంచి జరగనున్నాయి.

కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోసారి అసెంబ్లీ సమావేశాలు(Assembly sessions) రేపటి నుంచి జరగనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను శాసనసభ(Budget Sessions), మండలిలో ప్రవేశపెట్టనున్నారు. మరో ప్రధాన అంశం రైతు భరోసా పథకంపై(Rythu barosa) చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత విధివిధానాలపై నిర్ణయానికి వస్తామని ఇది వరకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti vikramarka) ప్రకటించారు. అలాగే, జాబ్ క్యాలెండర్‌ను(Job calender) కూడా రాష్ట్ర ప్రభుత్వం సమావేశాల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గ‌త కొద్ది రోజుల నుంచి ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఆయా శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.

అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడడానికి ముఖ్య కారణం కేసీఆర్‌(KCR) సమావేశాలకు హాజరవుతారా లేదా అనే అంశం. ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కేసీఆర్‌ అసెంబ్లీకి రాలేదు. ప్రమాణస్వీకారం కూడా అసెంబ్లీ సమావేశాల తర్వాత స్పీకర్ చాంబర్‌కు వచ్చి చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ రాకపోవడంతో అధికార పక్షం విమర్శలు కూడా చేసింది. శ్వేత పత్రాలు, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులపై చర్చకు రాకుండా కేసీఆర్‌ తప్పించుకున్నారని స్వయంగా రేవంత్‌రెడ్డే(Revanth reddy) అన్నారు. బయట ఎక్కడో బహిరంగసభలు పెట్టి విమర్శించడం కాదు, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్‌ విసిరారు. మరోవైపు కేసీఆర్‌ కాలికి శస్త్రచికిత్స చేయించుకోవడంతో ఆయన నడవలేకనే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదని బీఆర్‌ఎస్‌ వివరణ ఇచ్చుకుంది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ వస్తారా రారా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పార్టీ ఫిరాయింపులు, ప్రభుత్వ వైఫల్యాలు, పథకాల అమలుపై కేసీఆర్‌ ఏం మాట్లాడుతారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పట్ల కేసీఆర్‌ వైఖరి ఎలా ఉంటుందో చూడాలని.. ఏది ఏమైనా కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే మాత్రం సమావేశాలు హోరాహోరిగా కొనసాగుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story