100% ఉత్తీర్ణత ధ్యేయంతో ఈ ఏడాది విద్య విధానంలో కొన్ని కీలక మార్పులను ప్రవేశపెట్టింది తెలంగాణ విద్యాశాఖ . రాబోయే పదవతరగతి పరీక్షల విధానం లో కూడా పట్టిష్టమైన భద్రతలతో కూడిన సౌకర్యాలను అందించేలా ప్రయత్నాలు చేస్తుంది . గతఏడాది డిసెంబర్ నుండి 10 వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకమైన తరగతులని సాయత్రం వేళల్లో అదనంగా బోధించటం జరుగుతుంది. ఈ సమయంలో విద్యార్థులకు అల్పాహారం కూడా అందుబాటులో ఉంచింది . ఇదే తరహాలో మారిన పరీక్షల విధానంపై […]
100% ఉత్తీర్ణత ధ్యేయంతో ఈ ఏడాది విద్య విధానంలో కొన్ని కీలక మార్పులను ప్రవేశపెట్టింది తెలంగాణ విద్యాశాఖ . రాబోయే పదవతరగతి పరీక్షల విధానం లో కూడా పట్టిష్టమైన భద్రతలతో కూడిన సౌకర్యాలను అందించేలా ప్రయత్నాలు చేస్తుంది .
గతఏడాది డిసెంబర్ నుండి 10 వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకమైన తరగతులని సాయత్రం వేళల్లో అదనంగా బోధించటం జరుగుతుంది. ఈ సమయంలో విద్యార్థులకు అల్పాహారం కూడా అందుబాటులో ఉంచింది . ఇదే తరహాలో మారిన పరీక్షల విధానంపై విద్యార్థులకు ఎలాంటి ఆందోళన లేకుండా పూర్తి అవగాహనా కలిగే విధంగా ప్రీ-ఫైనల్ పరీక్షలను నిర్వహిస్తుంది .
ఏప్రిల్3వ తారీకు నుంచి 13వ తారీకు వరకు జరిగే పదవ తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ విద్యాశాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది.
పరీక్షా కేంద్రాలు అన్నిటిలోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనీ విద్య శాఖను ప్రభుత్వం ఆదేశించటం జరిగింది. పరీక్షా పత్రాలు తెరిచిన దగ్గర నుండి తిరిగి అవి ఇన్విజిలేషన్ కోసం ప్యాక్ అయ్యే వరకు జరిగే ప్రతి చిన్న విషయనికి సంబందించిన వివరాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యే విధానం తీసుకురావాలని కోరింది. ప్రయివేటు విద్యాసంస్థలు తమ సొంత ఖర్చులతో సీసీ-కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది .విద్యార్థుల పరీక్షపత్రాల్లో లేదా పరీక్షకేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు జరిగిన కఠినంగా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖకు కీలక ఆదేశాల్ని జారీచేసింది తెలంగాణ ప్రభుత్వం .