హైదరాబాద్ కాచిగూడలోని తారక రామ సినిమా హాల్‌లో ప్రదర్శితమవుతున్న ది కేరళ స్టోరీ(The kerala story) సినిమాను చూసేందుకు బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) థియేటర్ కు వెళ్లారు. బండి సంజయ్ వెంట పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్(Dr.Lakshman), ఇతర బీజేపీ నేతలు ఉన్నారు.
హైదరాబాద్ కాచిగూడలోని తారక రామ సినిమా హాల్‌లో ప్రదర్శితమవుతున్న ది కేరళ స్టోరీ(The kerala story) సినిమాను చూసేందుకు బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) థియేటర్ కు వెళ్లారు. బండి సంజయ్ వెంట పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్(Dr.Lakshman), ఇతర బీజేపీ నేతలు ఉన్నారు. అందరూ కలిసి సినిమా చూస్తుండటం విశేషం.
ఇదిలావుంటే.. ది కేరళ స్టోరీ సినిమాను వివాదాలు వెంటాడుతూ ఉన్నాయి. కేరళ(kerala), తమిళనాడు(Tamil nadu) రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. ది కేరళ స్టోరీ సినిమాను తమిళనాడులోని అన్ని మల్టిప్లెక్స్ థియేటర్లలో నిలిపివేశారు. చెన్నై(chennai), కోయంబత్తూర్(Coimbatore), మదురై(Madhurai), సేలంతోపాటు ముఖ్య నగరాల్లో మల్టీప్లెక్స్‌లో షోలు రద్దు చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా.. తమిళ నాడులోని మల్టీప్లెక్స్ థియేటర్లలో ఆదివారం నుంచి ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. కేరళలో జరిగిన లవ్ జిహాద్ యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు చెబుతున్నారు. కేరళ సీఎంతో సహా రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున సినిమాపై మండిపడ్డారు.
మరోపక్క ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు రూ.8.03 కోట్లు రాబట్టిన ఈ సినిమా శనివారం ఒక్కరోజే రూ.11.22 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు 39.73% వృద్ధి కనబర్చింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ.19.25 కోట్లు వసూలు చేసింది. ఆదివారం కలెక్షన్స్ మరింత పెరిగి రూ.16 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో తొలి మూడు రోజుల్లో రూ.35 కోట్ల వసూళ్లకు చేరువైంది.