రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహించిన అనంతరం ప్రస్తుతం బూత్ స్వశక్తికరణ్ కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం అనంతరం బండి సంజయ్ తో పాటు పార్టీలోని ముఖ్య నేతలంతా రథయాత్రలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ .. ఇందుకోసం బీజేపీ అప్పుడే వ్యూహారచనలు మొదలుపెట్టింది . ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలకు దగ్గర అయ్యేందుకు పార్టీ మరింత స్పీడు పెంచింది. ఇప్పటికే రాష్ట్ర నేతలతో సమావేశమైన అమిత్ షా.. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. దీంతో టీఎస్ బీజేపీ నేతలు వివిధ కార్యక్రమాలతో సమాయత్తం అవుతున్నారు.
తెలంగాణలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి . అయితే తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్యాయ పార్టీ మేమే అంటూ గర్వంగా చెప్పుకుంటున్న బీజేపీ ..ఏలాగైనా ఈ ఎన్నికల్లో గెలుపుతో తమ సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రజల్లోకి వెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా రథయాత్రలు చేపట్టాలని ప్లాన్ చేస్తోంది తెలంగాణ బీజేపీ .
అయితే ఈ మధ్యే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.... గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యుహాలు , చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించి నేతల్లో జోష్ పెంచారు. అయితే పార్టీ నేతలంతా కలిసి కట్టుగా పనిచేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అమిత్ షా నేతలకు సూచించారు. అమిత్ షా సూచనలతో తెలంగాణ బీజేపీ నేతలు స్పీడ్ పెంచారు. రాష్ట్ర ప్రజలకు మరింత చేరువయ్యేందుకు రథయాత్రలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పటికే ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ 5 విడతలుగా ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహించారు. ప్రజాగోస-బీజేపీ భరోసా నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా 11 వేలకు పైగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లను పార్టీ నిర్వహించింది. అయితే ఇప్పుడు రథయాత్ర కార్యక్రమం చేపట్టి ప్రజలకు చేరువ అయ్యేందుకు కార్యచరణను సిద్దం చేస్తోంది. రాష్ట్రంలోని రైతులు , విద్యార్ధులు , నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం బీజేపీ తోనే సాధ్యమన్న భరోసాను ప్రజలకు కల్పించడమే ఈ యాత్ర యొక్క ఉద్దేశం అని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. గతంలో రామజన్మభూమి ఆలయ నిర్మాణం కోసం బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ దేశ వ్యాప్తంగా రథయాత్ర నిర్వహించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ....పార్టీకి దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రజల నుంచి భారీ మద్దతును తీసుకువచ్చింది. పార్టీ కూడా బలోపేతం అయ్యింది. ఇప్పుడు అదే బాటను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహించిన అనంతరం ప్రస్తుతం బూత్ స్వశక్తికరణ్ కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం అనంతరం బండి సంజయ్ తో పాటు పార్టీలోని ముఖ్య నేతలంతా రథయాత్రలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే చేయబోయే పనులు, అమలు చేసే సంక్టేమ పథకాలను రధయాత్రల ద్వారా వివరించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని 17 ఎంపీ నియోజక వర్గాల పరిధిలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పాదయాత్రలు నిర్వహించిన అనంతరం ..భారీ బహిరంగా సభను నిర్వహించి ఎన్నికల శంఖరావాన్ని పూరించాలనే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. మరి బీజేపి చేపట్టనున్న రథయాత్రలు ఎంత వరకు గెలుపుకు దోహద పడతాయో చూడాలి.