ఎస్‌ఎస్‌సి ప్రశ్నపత్రం లీక్ కేసులో తెలంగాణ బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) కు హన్మకొండ మెజిస్ట్రేట్ కోర్టు రూ. 20,000 పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్(Bail) మంజూరుచేసింది. దీంతో ఆయన శుక్రవారం విడుదలయ్యే అవకాశం ఉంది. బండి సంజయ్ కుమార్ దేశం విడిచి వెళ్లకూడదని.. విచారణకు సహకరించాలని.. సాక్షులను ప్రభావితం చేయడం వంటివి చేయకూడదని కోర్టు షరతులు విధించింది. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గాని(Karimnagar Constituency) కి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను […]
ఎస్‌ఎస్‌సి ప్రశ్నపత్రం లీక్ కేసులో తెలంగాణ బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) కు హన్మకొండ మెజిస్ట్రేట్ కోర్టు రూ. 20,000 పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్(Bail) మంజూరుచేసింది. దీంతో ఆయన శుక్రవారం విడుదలయ్యే అవకాశం ఉంది. బండి సంజయ్ కుమార్ దేశం విడిచి వెళ్లకూడదని.. విచారణకు సహకరించాలని.. సాక్షులను ప్రభావితం చేయడం వంటివి చేయకూడదని కోర్టు షరతులు విధించింది.
కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గాని(Karimnagar Constituency) కి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను మంగళవారం అర్ధరాత్రి పోలీసులు నగరంలోని ఆయన నివాసం నుంచి తీసుకెళ్లి ముందస్తు అరెస్టు చేశారు. ఆపై పదవ తరగతి పరీక్ష పేపర్ లీక్ (Tenth Exam Paper Leak Case) కేసులో నగర పోలీసులు ఆయన్ని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. బండి సంజయ్ కుమార్ ప్రభుత్వం పరువు తీసేందుకు ఇతర నిందితులతో కలిసి కుట్ర పన్నారని పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఏప్రిల్ 5న కోర్టు ఈ కేసులో సంజయ్ కుమార్ కు ఏప్రిల్ 19 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
ఏప్రిల్ 6న తెలంగాణ హైకోర్టు(Telangana High Court) బండి సంజయ్ కుమార్ రిమాండ్‌ను రద్దు చేయడానికి నిరాకరించింది. బెయిల్ కోసం మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాలని బండి సంజయ్ న్యాయవాద బృందానికి సూచించింది. సుదీర్ఘ వాదనల అనంతరం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కు హన్మకొండ మెజిస్ట్రేట్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.