ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Sessions) మొదలవుతున్నాయి. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్(Governor) ప్రసంగించనున్నారు. రెండు నెలలలోపే గవర్నర్ తమిళిసై సౌందర రాజన్(Tamilisai Soundara Rajan) ఉభయసభల సభ్యులను ఉద్దేశించి మరోమారు ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ, మండలి రేపటికి వాయిదా పడతాయి.

TS Budget Assembly
ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Sessions) మొదలవుతున్నాయి. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్(Governor) ప్రసంగించనున్నారు. రెండు నెలలలోపే గవర్నర్ తమిళిసై సౌందర రాజన్(Tamilisai Soundara Rajan) ఉభయసభల సభ్యులను ఉద్దేశించి మరోమారు ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ, మండలి రేపటికి వాయిదా పడతాయి. సభలు వాయిదా పడిన తర్వాత బిజినెస్ అడ్వైజరి కమిటీలు అసెంబ్లీ, మండలి లో వేరువేరుగా సమావేశాలు అవుతాయి. బడ్జెట్ సమావేశాల పని దినాలు, ఎజెండాను బీఏసీ భేటీలో ఖరారు చేస్తారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీ, కౌన్సిల్లో రేపు చర్చ, సమాధానం. పదో తేదీన 2024-25 రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది. నీటి పారుదల రంగానికి సంబంధించి ఈ సమావేశాల్లో శ్వేతపత్రం ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. నీటిపారుదలపై చర్చతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వేడెక్కనున్నాయి. మరో రెండు గ్యారంటీల అమలుకు సంబంధించి కూడా ఈ సమావేశాల్లోనే సీఎం ప్రకటన చేయనున్నారు.బీసీ కులగణన కోసం ప్రత్యేక బిల్లును కూడా ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు. మరికొన్ని ఇతర బిల్లులు,శాసనసభ, మండలి ముందుకు రానున్నాయి.
