తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు.

Telangana Assembly Elections Started To Postal Ballot Vote
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections) ఓట్ల లెక్కింపు(Votes Count) ప్రక్రియ ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ల(Postal Ballot)ను లెక్కించనున్నారు. గతానికి భిన్నంగా ఈసారి ఓట్ల లెక్కింపులో పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొదటి అరగంటలో పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అనంతరం ఈవీఎంల ఓట్ల కౌంటింగ్ సాగుతుంది.
ఒక్కో రౌండ్ లెక్కింపు పూర్తికాగానే, ఫలితాన్ని ధ్రువీకరణ కోసం పంపిస్తారు. తర్వాత ఆర్వో ఆధ్వర్యంలో రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటించనున్నారు.ఇదిలావుంటే.. తెలంగాణ(Telangana) వ్యాప్తంగా 2.20 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయి. 131 టేబుళ్లల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ప్రతి 500 ఓట్లకు ఒకటి చొప్పున మొత్తం 131 టేబుళ్ల దగ్గర పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పార్టీల వారీగా వచ్చిన ఓట్లను ఏజెంట్ల సమక్షంలో ధృవీకరిస్తున్నారు.
