ఇల్లందు(Yellandu) అంటేనే ఆసక్తికర రాజకీయానికి కేరాఫ్‌. అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. ప్రతిపక్షాన్ని గెలిపించడం అక్కడి ఓటర్లకు అలవాటు. గత రెండు ఎన్నికల్లోనూ ఓటర్లు కాంగ్రెస్‎కు(Congress) జైకొట్టినా..అభ్యర్థులు మాత్రం ఏవో సాకులు చెప్పి.. సొంత పార్టీకి హ్యాండిచ్చి కారెక్కేశారు. ఇల్లందులో రెండుసార్లు కాంగ్రెస్ గెలవడానికి కారణమేంటి? ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందా? ఇల్లందును తమ ఖాతాలో వేసుకోవాలన్న గులాబీ సేన ప్రయత్నాలు ఫలిస్తాయా? ఇల్లందులో ఈసారి కనిపించబోయే పొలిటికల్ సీనేంటి? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.

ఇల్లందు(Yellandu) అంటేనే ఆసక్తికర రాజకీయానికి కేరాఫ్‌. అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. ప్రతిపక్షాన్ని గెలిపించడం అక్కడి ఓటర్లకు అలవాటు. గత రెండు ఎన్నికల్లోనూ ఓటర్లు కాంగ్రెస్‎కు(Congress) జైకొట్టినా..అభ్యర్థులు మాత్రం ఏవో సాకులు చెప్పి.. సొంత పార్టీకి హ్యాండిచ్చి కారెక్కేశారు. ఇల్లందులో రెండుసార్లు కాంగ్రెస్ గెలవడానికి కారణమేంటి? ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందా? ఇల్లందును తమ ఖాతాలో వేసుకోవాలన్న గులాబీ సేన ప్రయత్నాలు ఫలిస్తాయా? ఇల్లందులో ఈసారి కనిపించబోయే పొలిటికల్ సీనేంటి? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.

ఇల్లందు నియోజకవర్గం 1952, 1957లలో ద్విసభ్య నియోజకవర్గం. కమ్యూనిస్టు నాయకుడు కె.ఎల్. నరసింహారావు ఆ రెండుసార్లు కాకుండా, 1962లోనూ విజయం సాధించారు. 1978 నుంచి రిజర్వు అయిన తర్వాత ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. 1967లో జి.సత్యనారాయణ(G. Sathyanarayana) ఇక్కడి నుంచి గెలుపొందారు. ఆ తర్వాత సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ నేత గుమ్మడి నరసయ్య సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా పనిచేశారు. నిజాయితీ, నిరాడంబరతకు మారుపేరైన నరసయ్య(Narsaiah) ఐదుసార్లు ఏకధాటిగా ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. రాష్ట్ర విభజన వరకు నరసయ్యే ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి 2014 కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య(Kanakaiah) విజయం సాధించారు. సుమారు 42 ఏళ్ల తరువాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‎ను విజయం వరించింది. 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా హరిప్రియా నాయక్(Haripriya Nayak) గెలుపొందారు. 2014లో గెలిచిన కోరం కనకయ్య, 2018లో గెలిచిన బానోత్ హరిప్రియ నాయక్ ఇద్దరూ ఆ తర్వాత కాంగ్రెస్‎ను వదిలి బీఆర్ఎస్‎లో(BRS) చేరిపోయారు. ఇలా కాంగ్రెస్ నుంచి ఇద్దరు నేతలు పార్టీ మారడంతో హస్తం కార్యకర్తలు ఖంగుతిన్నారు.

కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరు ముఖ్యనేతలను పార్టీలో చేర్చుకోవడంతోనే బీఆర్ఎస్‎లో వర్గపోరు మొదలైంది.
ప్రస్తుత ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌ అభ్యర్థిత్వాన్ని కొంతమంది బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇల్లందు నియోజకవర్గంలో(Yellandu Assembly Constituency) బీఆర్ఎస్‌లో అసమ్మతి మంటలు కాక రేపుతున్నాయి. అసమ్మతి వాదులను శాంతపరిచేందుకు మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే హరిప్రియ రంగంలోకి దిగారు. ఇల్లందు బీఆర్ఎస్ పార్టీ అసమ్మతి నేత మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు ఇంట్లో బుజ్జగింపుల ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ కూడా జోక్యం చేసుకున్నారు. అభ్యర్థి ఎంపిక విషయం పార్టీకి వదిలేయాలని సర్దిచెప్పిన మంత్రి కేటీఆర్, నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని అసమ్మతి నేతలకు సూచించారు. అయినప్పటికీ నేతల మధ్య అసంతృప్తి కొనసాగుతుండటంతో..ఇల్లందు నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ రాజకీయం రసవత్తరంగా మారింది.

ఎమ్మెల్యే భర్త హరిప్రియ నాయక్ భర్త హరిసింగ్ షాడో ఎమ్మెల్యేగా పని చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే తండ్రి, ఇతర బంధువుల వ్యవహారశైలి కూడా ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కు మైనస్‌గా మారుతోంది. అయితే బలమైన లంబాడి సామాజిక వర్గ నేతగా హరిప్రియాకు ఆ వర్గం మద్దతు కలిసివచ్చే అవకాశం ఉంది. ఇల్లందు బస్సు డిపో, నియోజకవర్గానికి 16 వందల కోట్లు నిధులు తీసుకురావడం ఎమ్మెల్యే హరిప్రియకు సానుకూల అంశాలుగా చెబుతున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ప్రతి గ్రామంతో సంబంధాలు ఉండటం హరిప్రియానాయక్‌కు బలమని అంటున్నారు.

ఇక కాంగ్రెస్ తరఫున ఎక్కువ మంది నేతలు టిక్కెట్ కోసం పోటీపడుతున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశీస్సులు, అండదండలు ఉన్నవారికే అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. పొంగులేటి అనుచరుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఈ మధ్యే మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లారు. గతంలో పార్టీ తరపున గెలిచి.. బీఆర్‌ఎస్‌లో చేరడాన్ని స్థానిక క్యాడర్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. గతంలో ఎమ్మెల్యేగా ఆయన పనితీరుపై అనేక విమర్శలు ఉన్నాయి. జిల్లాల విభజన సమయంలో ఇల్లందును పట్టించుకోలేదని, సీతారామ ప్రాజెక్టు నీరు ఇతర జిల్లాలకు తరలిస్తున్నా అడ్డుకోలేకపోయారనే అపవాదు ఉంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు చాలా అంశాలు సానుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్ క్యాడర్‌లో ఎక్కువ మంది ప్రజాప్రతినిధులను తన వెంట కాంగ్రెస్‌లోకి తీసుకురావడం కనకయ్యకు అడ్వాంటేజ్‌గా మారే అవకాశం ఉందంటున్నారు. ఇక చీమల వెంకటేశ్వర్లు , డాక్టర్ రవి, లక్ష్మణ్ నాయక్, గుండెబోయిన నాగమణి, దళ్ సింగ్ నాయక్, పోరిక సాయిరాం నాయక్, విజయలక్ష్మి.. ఇలా ఏడుగురు నేతలు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ కాంగ్రెస్‌లో మూడు వర్గాలు ఉండగా, తాజాగా పొంగులేటి వర్గం ఒకటి తయారుకావడం కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది.

మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య కూతరు గుమ్మడి అనురాధ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించడంతో ఇల్లందు రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పనిచేస్తున్న అనురాధ చదువుకుంటున్నపుడే విద్యార్థి నాయకురాలిగా పనిచేశారు. తండ్రి రాజకీయ నేపథ్యం, ఆయన నిజాయితీ, అధికార పార్టీ బలంతో గెలుస్తానని ఆమె ధీమాగా ఉన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే సీతారామ ప్రాజెక్టు దారి మళ్లిందని, బయ్యారం ఉక్కు..మన హక్కు అని చెపి గెలిచిన వాళ్లు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదంటున్నారు గుమ్మడి అనురాధ. 25 ఏల్ల క్రితం స్వతంత్ర అభ్యర్థిగా గుమ్మడి నర్సయ్య చిన్న బడ్జెట్ తో నే గ్రామాల్లో రోడ్లు, స్కూళ్లు, డ్రైనేజీ సౌకర్యం కల్పించారని, గత పదేళ్ల కాలంలో ఇల్లందు అభివృద్ధిలో వెనకబడిందని ఆమె తెలిపారు. నియోజకవర్గం ప్రజలు తనను తప్పకుండా ఆదరిస్తారన్న విశ్వాంతో ఉన్నారు గుమ్మడి అనురాధ.

ఇల్లుందు రాజకీయం వాడివేడిగా ఉంది. కర్నాకట ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత వరుస విజయాలు సాధిస్తున్న కాంగ్రెస్ నేతలు.. హ్యాట్రిక్ కొడతామన్న ధీమాతో ఉన్నారు.
కాంగ్రెస్ టికెట్ కోసం రాష్ట్రంలోనే అత్యధికంగా 36 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ ఇల్లందు రాజకీయం మరింత హీటెక్కుతోంది. ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. అయితే రెండు పార్టీల్లో నెలకొన్న అసమ్మత్తి పోరు అధినాయకత్వాన్ని భయపెడుతోంది.

"Written By : Senior Journalist Sreedhar"

Updated On 18 Oct 2023 6:04 AM GMT
Ehatv

Ehatv

Next Story