తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) పోటీ చేయాలని ఉందా? అందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. మొట్టమొదటిది మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. రెండోది పాతికేళ్లు నిండి ఉండాలి. మూడోది ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలోని ఏదైనా నియోజకవర్గంలో ఓటు హక్కు తప్పనిసరిగా ఉండాలి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) పోటీ చేయాలని ఉందా? అందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. మొట్టమొదటిది మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. రెండోది పాతికేళ్లు నిండి ఉండాలి. మూడోది ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలోని ఏదైనా నియోజకవర్గంలో ఓటు హక్కు తప్పనిసరిగా ఉండాలి. ఈ మూడూ ఉంటే చక్కగా బరిలో దిగవచ్చు. కాకపోతే డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులైతే పది వేల రూపాయలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే అయిదు వేల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయపార్టీల నుంచి పోటీ చేస్తున్నానుకోండి. సంబంధిత నియోజకవర్గం నుంచి ఒక ఓటరు మిమ్మల్ని ప్రతిపాదిస్తే సరిపోతుంది. అదే ఇండిపెంటెంట్‌గా బరిలో దిగితే మాత్రంనియోజకర్గంలోని పది మంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది.