☰
✕
ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(TS assembly Sessions) జరగనున్నాయి.
x
ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(TS assembly Sessions) జరగనున్నాయి. వారం రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ నెల 23 న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ క్రమంలో రాష్ట్రానికి కేటాయింపులు బట్టి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్(Budget) ప్రవేశ పెట్టనుంది. ఈ నెల 25వ తేదీన కానీ 26వ తేదీన కానీ పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్(annual Budget) ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాలలో రైతు భరోసా, రైతు రుణమాఫీ అంశాలపై వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే కొత్త ఆర్వోఆర్ చట్టం, తెలంగాణ చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పులపై కూడా చర్చ జరుగుతుంది. ఈ సమావేశాలో పలు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆరు గ్యారెంటీల అమలు, నిరుద్యోగుల ఆందోళన, లా అండ్ ఆర్డర్ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీసే అవకాశం కనిపిస్తోంది.
Eha Tv
Next Story