కర్ణాటకలో(karnataka) బిజెపి(BJP) ఓటమి దక్షిణ భారత ప్రజల విజయం. దక్షిణ భారతం నుంచి బి జే పీ నీ ప్రజలు తరిమెస్తున్నరు అనడానికి ఇది నిదర్శనం. బి జె పి నీ తరమదానికి కర్ణాటక నుంచి బాటలు పడ్డాయని అనుకోవచ్చనీ, ప్రజల ఆకాంక్షలను అవసరాలను అర్థం చేసుకోకుండా వివక్ష విద్వేషాలను పెంచి పోషిస్తే ప్రజలు

కర్ణాటకలో(karnataka) బిజెపి(BJP) ఓటమి దక్షిణ భారత ప్రజల విజయం. దక్షిణ భారతం నుంచి బి జే పీ నీ ప్రజలు తరిమెస్తున్నరు అనడానికి ఇది నిదర్శనం. బి జె పి నీ తరమదానికి కర్ణాటక నుంచి బాటలు పడ్డాయని అనుకోవచ్చనీ, ప్రజల ఆకాంక్షలను అవసరాలను అర్థం చేసుకోకుండా వివక్ష విద్వేషాలను పెంచి పోషిస్తే ప్రజలు సహించరు అనే విషయం బి జే పీ కి అర్ధం అయ్యేలా కర్ణాటక ప్రజలు తీర్పు ఇచ్చారని అందో ల్ ఎం ఎల్ ఏ క్రాంతి కిరణ్ అన్నారు. అయితే కర్ణాటక ఫలితాలను చూసి తెలంగాణ కాంగ్రెస్స్(Telangana Congress) నాయకులు మాట్లాడుతున్న తీరు పులి నీ చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు వుంటది అని ఆయన అన్నారు.

కే సి ఆర్KCR) గారు అమలుచేస్తున్న పథకాలను కాపీ కొట్టి కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టో చేర్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయనన్నారు. 2018 ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్స్ పార్టీ ఇవే హామీలను మేనిఫెస్టో రూపంలో ప్రజల ముందుకు తీసుకుపోయారు అయిన తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మలేని విషయాన్ని మర్చిపోరాదని ఆయన అన్నారు. కే సి ఆర్ నాయకత్వం లోని బి ఆర్ ఎస్ మీదే తెలంగాణ ప్రజలకు పూర్తి విశ్వాసం వుందని ఆయన అన్నారు.

Updated On 14 May 2023 1:34 AM GMT
Ehatv

Ehatv

Next Story