క్యూ న్యూస్ ద్వారా వార్తలను విశ్లేషిస్తుంటాడు. ఈ క్రమంలోనే ఈ మధ్యన తన న్యూస్ ఎనాలిసిస్ ప్రోగ్రాంలో బీసీల నినాదం ఎత్తుకున్నారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం తెలంగాణ శాసనమండలి ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. క్యూ న్యూస్ ద్వారా వార్తలను విశ్లేషిస్తుంటాడు. ఈ క్రమంలోనే ఈ మధ్యన తన న్యూస్ ఎనాలిసిస్ ప్రోగ్రాంలో బీసీల నినాదం ఎత్తుకున్నారు. బీసీలకు రాజ్యాధికారం కావాలంటూ పలు సమావేశాల్లో పాల్గొన్నాడు. ఇకపై తనకు రెడ్డీలు ఎవరూ ఓటు వేయొద్దని.. నా బీసీ బిడ్డలు ఓట్లు వేస్తే నేను గెల్చిపోతానని అన్నాడు. అప్పుడప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను బాహాటంగానే విమర్శిస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై విరుచుకుపడుతున్నాడు. ఎవని సొమ్ము అని కాంట్రాక్టుల పేరుతో దోచుకుంటున్నారని విమర్శలు గుప్పించాడు. మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కూడా ఏకిపారేశాడు. అయితే తాజాగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమ ఆహ్వాన పత్రికలో తీన్మార్ మల్లన్న పేరు లేకపోవడంపై తన చానెల్‌లో చెప్పుకొని ప్రశ్నించాడు. ఇతర పార్టీల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల పేర్లు ఉన్న పత్రికలో తన పేరు ఎందుకు లేదని అడిగాడు. దీనికి కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాడు. ఆహ్వాన పత్రికలో తన పేరు లేదంటే ఇక నన్ను రావొద్దు అన్నట్లేగా అని ప్రశ్నించాడు. తాను వస్తే సమస్యలపై నిలదీస్తానన్న భయం పట్టుకుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇసుక దందా, అవినీతిపై ప్రశ్నిస్తానని భయపడ్డాడా అంటూ నిలదీశాడు. గత కొంత కాలంగా తీన్మార్ మల్లన్న వైఖరి చూస్తే కాంగ్రెస్‌లో ఎవరో తనను టార్గెట్ చేశారని తీన్మార్ మల్లన్న భావిస్తున్నారట. గతంలో జిల్లాలో ఓ మంత్రిని దుర్భాషలాడిన దళిత నేతకు ఇప్పటివరకు న్యాయం చేయకుండా అడ్డుకుంటున్నాడనే టాక్ ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తనను కూడా డైరెక్ట్ టార్గెట్ చేసినట్లు మల్లన్నకున్న సమాచారమని తెలుస్తోంది. అయితే మాత్రం బీసీ నినాదం ముందు పెట్టుకొని మంత్రి పదవి తెచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీని తిట్టీతిట్టనట్లు, అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నాడని మల్లన్నకు గిట్టని వారు గుసగుసలాడుకుంటున్నారు.