చింత పండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జి మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మలన్నకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

చింత పండు నవీన్(Chinthapandu Naveen) అలియాస్ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) కాంగ్రెస్‌(Congress)లో చేరారు. ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జి మానిక్ రావ్ ఠాక్రే(Manikrao Thacrey), టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) మలన్నకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఆబ్జర్వర్ బోస్ రాజు(Bosu Raju), సిడబ్ల్యుసి సభ్యుడు గురుదీప్ సిప్పల్, ఏఐసీసీ సెక్రటరీలు పి.సి విష్ణునాధ్, రోహిత్ చౌదరి, మన్సూర్ అలీ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

తీన్మార్‌ మలన్న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే ప్రచారం గత కొంత కాలంగా జరుగుతుంది. తాజాగా ఆ ప్రచారానికి తెర దించుతూ ఆయన హస్తం గూటికి చేరారు. గతంలో మల్ల‌న్న బీజేపీ(BJP)లో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. రాష్ట్రంలో అధికార పార్టీపై మల్ల‌న్న తనదైన శైలిలో విరుచుకుపడుతుంటారు. గతంలో జైలుకు కూడా వెళ్లి వచ్చారు. హుజూర్‌నగర్ ఉపఎన్నికలు, పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. మంత్రి మ‌ల్లారెడ్డిపై పోటీచేయాల‌ని భావిస్తున్న‌ట్లు ప‌లుమార్లు ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు.

ఇదిలావుంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఆల్ ఇండియా ఫార్వర్ట్ బ్లాక్ పార్టీ, మలన్నను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు మల్లన్నతో పార్టీ వర్గాలు చర్చలు కూడా జరిపాయి. ఇంతలోనే మల్ల‌న్న కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ మ‌ల్ల‌న్న‌కు ఎటువంటి అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంద‌నేది వేచి చూడాలి.

Updated On 7 Nov 2023 11:13 PM GMT
Yagnik

Yagnik

Next Story