దెయ్యాల్లేవు(Ghost), భూతాల్లేవు.. నాన్సెన్స్‌ అని కొట్టిపారేసేవారు ఎంతమంది ఉంటారో, ఉన్నాయని గట్టిగా నమ్మేవారు అంతే మంది ఉంటారు.

దెయ్యాల్లేవు(Ghost), భూతాల్లేవు.. నాన్సెన్స్‌ అని కొట్టిపారేసేవారు ఎంతమంది ఉంటారో, ఉన్నాయని గట్టిగా నమ్మేవారు అంతే మంది ఉంటారు. పల్లెల్లో అయితే ఇలాంటి నమ్మకాలు చాలా ఎక్కువ. అలాగే ఆదిలాబాద్‌(Adilabad) జిల్లా జైనథ్‌ మండలం ఆనందపూర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో దెయ్యం ఉందనే ప్రచారం జోరుగా సాగింది. తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్‌కు పంపించడం మానేశారు. ఈ నెల 2వ తేదీన నూతల రవీందర్‌రెడ్డి(Nuthala Ravinder reddy) అనే ఉపాధ్యాయుడు బదిలీపై వచ్చారు. ఈయన జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా! ఓ రోజు తరగతి గదిలో పాఠం చెబుతున్నప్పుడు బయట పెద్ద శబ్దం వచ్చింది. పిల్లలంతా ఉలిక్కిపడ్డారు. ఎందుకు అలా ఉలికిపబడి భయపడుతున్నారని టీచర్‌ అడిగారు. బడిలో దెయ్యం ఉంది సార్‌, అందుకే భయపడుతున్నామని విద్యార్థులు చెప్పారు. బడి పిల్లలలో ధైర్యం నూరిపోయడానికి, దెయ్యం భయం తొలగించడానికి రవీందర్‌రెడ్డి అమావాస్య రాత్రి ఒంటరిగా స్కూల్‌లో పడుకున్నారు(sleep). ఆ విధంగా దెయ్యం లేదని నిరూపించారు. ఇప్పుడు పిల్లలు, తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.

Eha Tv

Eha Tv

Next Story