తెలంగాణలో(Telangana) బతుకమ్మ(Bathukamma) గొప్ప వేడుక. అచ్చంగా జానపదుల పండుగ. ప్రాచీనమైన పండుగ. కావ్యాల్లోనూ, చరిత్ర పుస్తకాల్లోనో లేకపోయినంత మాత్రానా బతుకమ్మను ఇటీవలి పండుగగా చెప్పుకోవద్దు. చరిత్రలో చాలా అంశాలకు చోటు దొరక్కపోవచ్చు. దానికి రకరకాల కారణాలుంటాయి.జానపదులకు ఎంతో ఆరాధనీయమైన తంగెడుపూల(Thangedu Flower) ప్రస్తావన ఎందుకో కావ్యాల్లో కనిపించదు. నాగరికులూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ బంగరుపూల సోయగాన్ని చూడాలంటే కాపు కన్నెల ముద్ద కొప్పుల్లో చూడాలి.

వాసన లేకపోతేనేం వలపు బాసలు నేర్చిన పూలు కాబట్టే స్త్రీల సిగలో కాపురముంటున్నాయి. తంగెడుపూలకు బతుకమ్మకు(Bathukamma) విడదీయరాని సంబంధం వుంది. బతుకమ్మ పండుగ ఆవిర్భావానికి సంబంధించి కాల నిర్ధారణ చేయడం కష్టం. జానపద రచనకు ఆచారానికి కాల నిర్ధారణ చేయడం ఇప్పుడున్న ఆధారాలు సరిపోవు. అయితే పండుగ నేపథ్యాన్ని వివరించే నాలుగైదు కథనాలు బతుకమ్మ పాటల్లోనే వున్నాయి.

ఓ బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం బతుకమ్మా అని దీవించారని, అందుకనే ఇది స్ర్తీలకు సంబంధించిన పండుగైందని చెబుతారు. మరో కథలో దక్షిణ భారతాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగుడనే రాజు ఆయన భార్య సత్యవతి వంద నోములు నోచి వంద మంది పుత్రులకు జన్మనిచ్చారు. యుద్ధంలో వారంతా అమరులయ్యారు.

ఆవేదన చెందిన రాజదంపతులు లక్ష్మీదేవి కోసం తపస్సు చేశారు. లక్ష్మీదేవి ప్రసన్నురాలై సత్యవతి బిడ్డగా జన్మిస్తుంది. బతికిన ఈ తల్లి బతుకమ్మ అవుతుందనే మహర్షుల ఆశీర్వచనల ప్రకారం అప్పట్నుంచి ఆమె బతుకమ్మ అయింది. సంతానం కోసం పూజలు చేశాడట! లక్ష్మి దేవి అనుగ్రహంతో ఆయన భార్య గర్భవతై కూతుర్ని కనిందట! అనేక గండాల్నుంచి గట్టెక్కింది కాబట్టి పాపకు బతుకమ్మా అని పేరు పెట్టారట! అప్పట్నుంచి యువతులు బతుకమ్మను కొలవడం ఆనవాయితీగా వస్తుందట!

అసలు బతుకమ్మ పండుగకు, నవరాత్రి ఉత్సవాలకు కూడా దగ్గర సంబంధం వుందట! మహిషాసురునితో యుద్ధం చేసి దుర్గాదేవి అలసిపోయిందట! ఆ అలసటతోనే సుప్తావస్థలోకి వెళ్లిపోయిందట! ఆమెకు సేద తీర్చి తిరిగి యుధాస్థితికి తీసుకురావడానికి స్త్రీలు సేవలు చేసి పాటలు పాడారట! తొమ్మిదో రోజుకు ఆమె అలసట తీరిందట! వెంటనే మహిషాసురుడ్ని సంహరించి తన కర్తవ్యాన్ని నిర్వహించిందట! ఆ జగన్మాత జనులకు జీవితాన్ని, బతుకునూ ప్రసాదించింది కాబట్టే గ్రామీణులు ఆమెను బతుకమ్మగా పిల్చుకుంటున్నారనేది ఓ కథ కూడా ప్రచారంలో వుంది.

Updated On 14 Oct 2023 12:24 AM GMT
Ehatv

Ehatv

Next Story