తెలంగాణ గవర్నర్(Telangana Governor) తమిళిసై(Tamilisai) తన పదవికి రాజీనామా(Resign) చేశారు. ఆమె రాజీనామాను ఎప్పట్నుంచో ఊహిస్తున్నదే కాబట్టి ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలుగలేదు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లాలని ఉందని, లోక్‌సభకు పోటీ చేయాలని అనుకుంటున్నానని తమిళిసై ఇంతకు ముందు చెప్పారు.
తెలంగాణ గవర్నర్(Telangana Governor) తమిళిసై(Tamilisai) తన పదవికి రాజీనామా(Resign) చేశారు. ఆమె రాజీనామాను ఎప్పట్నుంచో ఊహిస్తున్నదే కాబట్టి ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలుగలేదు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లాలని ఉందని, లోక్‌సభకు పోటీ చేయాలని అనుకుంటున్నానని తమిళిసై ఇంతకు ముందు చెప్పారు. చెప్పినట్టుగానే గవర్నర్ పదవికి రాజీనామా చేసి క్రియాశీల రాజకీయాల్లోకి మళ్లీ రావడానికి రెడీ అవుతున్నారు. 2019లో తెలంగాణ గవర్నర్ పదవిని ఆమె చెపట్టారు. లాస్టియర్ నుంచి పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఇవాళ ఆమె తన రెండు పదవులకు రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు.
ఇంతకుముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పని చేసిన తమిళిసై 2006 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి రామనాథపురం నియోజవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినా ఆమె పట్టుదల వీడలేదు. 2009లో చెన్నై నార్త్ నుంచి పోటీ చేశారు. ఫలితం సేమ్ టు సేమ్. ఏ మాత్రం నిరాశపడకుండా 2019లో తూత్తుకూడి నుంచి పోటీ చేశారు. ఫలితం యథాతథం. పోటీ చేసిన మూడు సార్లు ఆమె ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి బీజేపీ అధిష్టానం 2019లో ఆమెకు గవర్నర్ పదవిని కట్టబెట్టింది. గవర్నర్ పదవిలో ఉంటూ రాజకీయాలు చేశారు. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో గవర్నర్‌కు పడలేదు. పలుమాల్లు విభేదాలు తలెత్తాయి. ప్రభుత్వం పంపిన బిల్లుల్ని వెనక్కి తిప్పి పంపడం, పెండింగ్‌లో ఉంచడం ద్వారా వార్తల్లోకి వచ్చారు. ఆ వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. ఇప్పుడు ఆమె తమిళనాడులోని చెన్నైసెంట్రల్ లోక్‌సభ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. తమిళిసై పోటీకి బీజేపీ అధినాయకత్వం ఓకే చెప్పిందట!