రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Guntakandla Jagadish Reddy) శుక్రవారం సూర్యాపేట(Suryapet) మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ(Ganesh Festival) కమిటీలకు మట్టి విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ హితమైన పట్టణంగా సూర్యాపేటను తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. తడి పోడి చెత్తలో సూర్యాపేటకు జాతీయస్థాయి గుర్తింపు వచ్చిందని.. ప్లాస్టిక్ నివారణ విషయంలో కూడా మనమే ముందు ఉండాలని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ తో మానవాళికి పెను ప్రమాదం ఉందన్నారు. ప్లాస్టిక్(Plastic) నివారణకు మన వల్ల చేయగలిగే మేలు చేయాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో నీటి కాలుష్యం.. ఆ నీళ్లతో అనేక రకాల సమస్యలు ఉంటాయని వివరించారు. క్యాన్సర్‌కు ప్రధాన కారణం ప్లాస్టిక్ అన్నారు. గాలి, నీరు, భూమి దేన్నైనా.. ప్లాస్టిక్ కాలుష్యం చేస్తుందన్నారు.
మట్టి విగ్రహాలు(Clay idols) మంచివని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ జరుగుతందని తెలిపారు. మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుదామని పిలుపునిచ్చారు. ఉత్సవ కమిటీలు విధిగా మట్టి విగ్రహాలను పూజించాలని సూచించారు.
సూర్యాపేట మున్సిపాలిటీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లలో అందుబాటులో ఉన్న మట్టి విగ్రహాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొత్తగా సీడ్ విగ్రహాలను తయారు చేయడం జరిగిందని.. ఈ విగ్రహాలను ఇండ్లలో పూజించి భూమిలో నాటితే మొక్కలుగా పెరుగుతాయని.. అలా చేస్తే పర్యావరణానికి ఎంతో మేలు చేసినవారవుతారని అన్నారు.