MLA Jagadish Reddy : చదువుల తల్లికి అండగా నిలిచిన ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి
ఉన్నత చదువులకు ఆటంకంగా నిలిచిన ఆర్థిక పరిస్థితితో దిక్కుతోచని స్థితిలో ఉన్న గిరిజన నిరుపేద విద్యార్థినికి(Tribal stuent) మజీ మంత్రి, సూర్యాపేట(Suryapet) ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి(Jagadish Reddy) అండగా నిలిచారు. ఆమె విద్యాభ్యాసం పూర్తి అయ్యే వరకు అండగా ఉంటానని భరోసానిచ్చారు.

MLA Jagadish Reddy
ఉన్నత చదువులకు ఆటంకంగా నిలిచిన ఆర్థిక పరిస్థితితో దిక్కుతోచని స్థితిలో ఉన్న గిరిజన నిరుపేద విద్యార్థినికి(Tribal stuent) మజీ మంత్రి, సూర్యాపేట(Suryapet) ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి(Jagadish Reddy) అండగా నిలిచారు. ఆమె విద్యాభ్యాసం పూర్తి అయ్యే వరకు అండగా ఉంటానని భరోసానిచ్చారు.
సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం లాల్‌సింగ్ తాండాకి(Lal Singh Tanda) చెందిన బానోతు ఐశ్వర్య(Banothu Aishwarya) చిన్ననాటి నుంచి చదువులో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తూ వస్తుంది. బీఎస్సీ నర్సింగ్‌కు(BSC nursing) కోర్సుకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో సీటు సాధించిచిన ఐశ్వర్య, వ్యవసాయ కూలీ కుటుంబం కావడంతో ఇతర ఖర్చులు భరించ లేని స్థితిలో ఉంది. దీంతో అక్కడి స్థానిక నాయకుల ద్వారా పరిస్థితి తెలుసుకున్న జగదీష్‌రెడ్డి దృష్టికి వచ్చింది. ఐశ్వర్యతో పాటు ఆమె తల్లి ని సూర్యాపేటకు పిలిపించిన జగదీష్‌రెడ్డి ఐశ్వర్య విద్య పూర్తయ్యే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఐశ్వర్య ఉన్నత విద్య పూర్తయ్యే వరకు తాను బాధ్యత తీసుకుంటున్నట్లు కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు.
అత్యంత నిరుపేద పరిస్థితుల్లో అనేక సవాళ్లు దాటుకొని చదువులో రాణిస్తున్న ఐశ్వర్య తోటి విద్యార్ధులకు స్ఫూర్తిగా నిలుస్తుందని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ప్రతిభ ఎవరి సొత్తు కాదని, కృషితో ఏలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చనే విషయాన్ని ఐశ్వర్య నిరూపించిందని అన్నారు. ఐశర్వ్య లాంటి అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆడబిడ్డకి అండగా నిలవడం తనకు అత్యంత సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుందని అన్నారు. వైద్య రంగంలో భవిష్యత్‌ఓ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఇదిలా ఉండగా తన నర్సింగ్ విద్యకు సాయమందించిన జగదీష్‌రెడ్డికి ఐశ్వర్య, ఆమె కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జగదీషన్నకు జీవితాంతం రుణపడి ఉంటానని, వైద్యరంగంలో ప్రజలకు సేవ చేసి, జగదీషన్న తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఐశ్వర్య తెలిపారు.
