తెలంగాణ(Telangna) ప్రజలు తమ హక్కు వదులుకోవడానికి సిద్ధంగా లేరని.. నీటి పంపకాల(Water sharing) విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి జగదీశ్ రెడ్డి(Jagadish Reddy) స్ప‌ష్టం చేశారు. నాగార్జున సాగర్(Nagarjuna Sagar) వివాదంపై సూర్యాపేటలో (Suryapet+)ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. సాగర్ నీటి విషయంలో మొదటి నుండి ఆంధ్రప్రదేశ్ మొండిగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం కృష్ణా నీటి పంపకాల సరైన నిర్ణయం తీసుకోకపోవడంతోనే సమస్య వస్తుందన్నారు.

తెలంగాణ(Telangana) ప్రజలు తమ హక్కు వదులుకోవడానికి సిద్ధంగా లేరని.. నీటి పంపకాల(Water sharing) విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి జగదీశ్ రెడ్డి(Jagadish Reddy) స్ప‌ష్టం చేశారు. నాగార్జున సాగర్(Nagarjuna Sagar) వివాదంపై సూర్యాపేటలో (Suryapet)ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. సాగర్ నీటి విషయంలో మొదటి నుండి ఆంధ్రప్రదేశ్ మొండిగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం కృష్ణా నీటి పంపకాల సరైన నిర్ణయం తీసుకోకపోవడంతోనే సమస్య వస్తుందన్నారు. చంద్రబాబు(Chandrababu), జగన్(Jagan) ప్రభుత్వాల్లో కృష్ణా నీటి సమస్య కొనసాగుతుందన్నారు.

నీటి పంపకాల విషయంలో రాజీ పడేది లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ మొండి వైఖరితో తొండి చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మా రాష్ట్ర వాట నుంచి ఒక్క చుక్క కూడా పోనీయం అన్నారు. సాగు, తాగు నీటి కొసం మేమంతా సాగర్ పై ఆధారపడి ఉన్నామ‌న్నారు. కోట్లాది మంది ప్రజల జీవితాలతో చెలాగాటమాడే పద్దతిలో ఆంధ్ర వ్యవహారం సరైందికాదన్నారు. ఆంధ్ర తీరు సహించబోమన్నారు. కేసీఆర్ ఉన్నంత కాలం మా హక్కుల్ని హరించడం ఎవరివల్ల కాదన్నారు. నీటి వివాదం అడ్డంపెట్టుకుని చిల్లర రాజకీయం చేసే అలవాటు మాకు లేదన్నారు.

Updated On 30 Nov 2023 12:31 AM GMT
Ehatv

Ehatv

Next Story