ప్రేమ.. ఎప్పుడు.. ఎవరికి.. ఎలా.. ఎందుకు పుడుతుందో తెలియదు. అది పుట్టినప్పుడు వయసు, కులం, మతం అడ్డురాదని అంటారు. ఈ తరహాలోనే ఓ యువతీ, యువకుడు ప్రేమించుకున్నారు. నాలుగేళ్లుగా కలిసి తిరిగారు. పెళ్లి చేసుకొని వివాహ జీవితాన్ని కొనసాగించాలని అనుకున్నారు. కానీ సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయిగా అవే వారి పెళ్లికి శాపమయ్యాయి.

ప్రేమ.. ఎప్పుడు.. ఎవరికి.. ఎలా.. ఎందుకు పుడుతుందో తెలియదు. అది పుట్టినప్పుడు వయసు, కులం, మతం అడ్డురాదని అంటారు. ఈ తరహాలోనే ఓ యువతీ, యువకుడు ప్రేమించుకున్నారు. నాలుగేళ్లుగా కలిసి తిరిగారు. పెళ్లి చేసుకొని వివాహ జీవితాన్ని కొనసాగించాలని అనుకున్నారు. కానీ సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయిగా అవే వారి పెళ్లికి శాపమయ్యాయి. కులాలు వేరుకావడంతో వీరి పెళ్లికి పెద్దలు అడ్డు చెప్పారు. దీంతో ఈ జంట మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సూర్యాపేట జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే గుండగాని సంజయ్ గౌడ్ సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్‌ గ్రామవాసి. వ్యవసాయంతో పాటు సూర్యాపేటలో వాటర్ ఫూరిఫైర్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఈ గ్రామానికే చెందిన చల్లగుండ్ల నాగజ్యోతి నర్సింగ్‌ పూర్తి చేసింది. స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తొంది. ఒకే గ్రామం కావడం సూర్యాపేట(Suryapet)కు వస్తూపోతుండడంతో ఇద్దరి మధ్య ఉన్న పరిచయం ప్రేమ వరకు వెళ్లింది. నాగజ్యోతి, సంజయ్‌ గౌడ్‌ నాలుగేళ్లపాటు ప్రేమించుకున్నారు. కులాలు వేరైనా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఇదే విషయాన్నితమ కుటుంబ సభ్యులకు వెల్లడించారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు కులం పేరుతో అభ్యంతరం చెప్పారు. సంజయ్‌ గౌడ సామాజిక వర్గానకి చెందినవాడు కావడం, నాగజ్యోతి ఎస్సీ సామాజికవర్గానికి చెందడంతో పెళ్లికి తీవ్ర అభ్యంతర చెప్పారు. అయినా ఈ ప్రేమజంట తమ ప్రయత్నాలను ఆపలేదు.. పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నించినా సఫలం కాలేదు. ఎంత ప్రయత్నించినా తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. కలిసి బతకలేకున్నా కలిసి చనిపోదామనుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామశివారులో విగత జీవులుగా ఉన్న సంజయ్, నాగజ్యోతిని గుర్తించిన స్థానికులు కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకోవడంతో ఇటు గ్రామంలో అటు బాధిత కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Updated On 29 April 2024 5:22 AM GMT
Ehatv

Ehatv

Next Story