భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాకు చెందిన నల్లపు మణిదీప్ (Manideep)అనే ఓ యువకుడు సుప్రీంకోర్టు ని సైతం కదిలించే పని చేసాడు. అతను చేసిన పనికి ఇటు రాష్ట్రాల కోర్టు తో పాటు పాటు సుప్రీంకోర్టు కూడా సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితీ ఏర్పడింది .ఇంతకు ఆ యువకుడు ఎం చేసాడో తెలిస్తే మీరు ఆశ్చర్యం తో పాటు ప్రతి ఒక్కరు అభినందిస్తారు .

భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాకు చెందిన నల్లపు మణిదీప్ (Manideep)అనే ఓ యువకుడు సుప్రీంకోర్టు ని సైతం కదిలించే పని చేసాడు. అతను చేసిన పనికి ఇటు రాష్ట్రాల కోర్టు తో పాటు సుప్రీంకోర్టు కూడా సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది .ఇంతకు ఆ యువకుడు ఏం చేసాడో తెలిస్తే మీరు ఆశ్చర్యం తో పాటు ప్రతి ఒక్కరు అభినందిస్తారు .

భారత ప్రభుత్వం మనకు అందించిన చట్టాల్లో సమాచార హక్కు చట్టం(RTI)(Right to Information) అనేది ఉందని చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఈ సమాచార హక్కు చట్టం ద్వారా మన ప్రభుత్వం తరుపున జరిగే ఎలాంటి కార్యకలాపాలు విషయంలో సమాచారాన్ని పొందే హక్కు మనందరికీ ఉంది. మొదట్లో ఈ చట్టం పార్లమెంటు, లేక విధాన సభ లేక విధాన పరిషత్ సభ్యులకు గల ఈ సౌకర్యాన్ని, ఈ చట్టం ద్వారా ప్రజలందరికి కలిగింది.ఈ చట్టం ద్వారా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ అధికారాలు ,మరియు సమాచారానికి సంబంధించి ఇలా 17 రకాల అంశాల గురించి ప్రశ్నించి సమాధానం పొందే హక్కు మనకు కల్పించింది భారత ప్రభుత్వం. అడిగిన విషయంపై నెల రోజులు అంటే 30 రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది . 30 రోజుల గడువు దాటితే సమాచారాన్ని ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుందని వినియోగదారులు గమనించాలి .

భద్రాద్రి యువకుడు సమాచార హక్కు చట్టం నుండి మణిదీప్‌ కోరిన సమాచారం ఏమిటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి అంటే సుమారు మణిదీప్‌ కోరిన సమాచారం ఏమిటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి అంటే సుమారు 73ఏళ్ల కాలంలో నమోదైన కేసులెన్నీ..? అందులో తీర్పు వచ్చినవి ఎన్ని ? రానివి ఎన్ని..? ఇంకా పెండింగ్‌లో ఉన్న కేసులెన్నీ..?..ఎన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయి..? వీటిపై సమాచారం కావాలని కోరాడు.73 ఎల్లకాలం నుండి నమోదైన కేసుల వివరాలు కోసం ఇచ్చిన ఒకే ఒక్క ఆర్టీఐ దరఖాస్తు సుప్రీం కోర్టే కాదు దేశంలోని అన్నీ హైకోర్టులతో పాటు జిల్లా కోర్టులు, సీబీసీఐడీ న్యాయస్థానాలు, ట్రైబ్యునల్స్ ఇలా అన్ని కోర్టుల్నీ అతను అడిగిన సమాచారం కదిలేలా చేసింది.

భారత దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలకు సంబంధించి తీర్పు వెల్లడించినవి, ఇంకా తీర్పు రానివి, పెండింగ్‌లో ఉన్న కేసులు, ఎన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి..అందుకు గల కారణాలపై సమాచారం ఇవ్వాలని సెక్షన్ 4(1(C)(D)కోరాడు మణిదీప్ . గత నెలలో మణిదీప్ వేసిన ఆ ఒక్క పిటిషన్‌పై డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్(DOJ), డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్‌(LAD) స్పందించింది. మణిదీప్‌ కోరిన వివరాలు, సమాచారం అందజేసేందుకు అంగీకరిస్తూ అతని దరఖాస్తును సుప్రీం కోర్టు(Supreme Court)తో పాటు అన్నీ హైకోర్టులకు ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది. ఈ ఆర్టీఐ దరఖాస్తుపై పూర్తి సమాచారం ఇచ్చేందుకు అవసరమైతే ఇతర శాఖలకు పంపించి ఇవ్వవలసినదిగా కోరింది.

ప్రభుత్వం అవసరాలను ప్రజలు ఎలా వినియోగించుకోవాలో తెలియజేసే విషయంలో మణిదీప్ ముందడుగు వేసి స్పూర్తి గా నిలిచాడు. ప్రబుత్వజాబ్ కోసం చదువుకుంటున్న మణిదీప్ వేసిన పిటిషన్ సుప్రీం కోర్టు స్పందించటం ఆనందంగా ఉందంటూ చెప్పడం జరిగింది. పూర్తి సమాచరం ఇచ్చేందుకు చట్టం తనకు సహాయం చేస్తుందని భావాన్ని వ్యక్త పరిచాడు . కాలక్షేపం పేరుతో గంటల సమయాన్ని మొబైల్స్ తో వృధాగా గడుపుతున్న యువతకు మణిదీప్ ఒక స్ఫూర్తిగా నిలవనుంది .భాద్యత గల పౌరుడిగా మణిదీప్ వేసిన పిటిషన్ భారత న్యాయస్థానాన్ని కదిలించటం అనేది ప్రశంసనీయం అంటూ ప్రముఖులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు .

Updated On 22 March 2023 2:14 AM GMT
Ehatv

Ehatv

Next Story