ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై(Revanth reddy) సుప్రీం న్యాయమూర్తులు(Supreme Court) గుస్సా అయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై(Revanth reddy) సుప్రీం న్యాయమూర్తులు(Supreme Court) గుస్సా అయ్యారు. ఓటుకు నోటు కేసు(Note For Vote) విచారణ సందర్భంగా రేవంత్‌రెడ్డిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) బెయిల్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి సుప్రీంకోర్టు తీర్పు పైన ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఘాటుగా వ్యాఖ్యానించారు. అత్యున్నత న్యాయస్థానంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం ప్రకటనలపై స్పందిస్తూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆ విధంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎవరైనా విమర్శించినా పట్టించుకోవడం లేదని, అయితే తమ మనస్సాక్షి ప్రకారం విధులు నిర్వహిస్తామని న్యాయమూర్తులు అన్నారు. రాజకీయపార్టీల అనుమతితో తాము ఆదేశాలు ఇవ్వాలా అని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.