☰
✕
తామిచ్చిన తీర్పు గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డిపై(Revanth reddy) సుప్రీం కోర్టు(Supreme court) తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
x
తామిచ్చిన తీర్పు గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డిపై(Revanth reddy) సుప్రీం కోర్టు(Supreme court) తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీని గురించి రేవంత్‌కు గతంలో నోటీస్ ఇచ్చిన విషయం విదితమే. ఈరోజు ఆ నోటీసుకు స్పందిస్తూ తనని క్షమించాలి అని రేవంత్ రెడ్డి తన న్యాయవాది ద్వారా కోరగా, రాజ్యంగబద్ధమైన పదవులలో ఉన్నవారు వ్యవస్థలలోని ఇతర విభాగాల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాలని హితవు పలికింది. కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించింది. ఓటుకు నోటు కేసు(Vote for note) ప్రాసిక్యూషన్‌లో రేవంత్ రెడ్డి ఎటువంటి జోక్యం చేసుకోరాదని, డీజీపీ, అవినీతి నిరోధక శాఖ రేవంత్ రెడ్డికి ఈ కేసు విషయమై రిపోర్టు చేయరాదని కోర్టు ఆదేశించింది.
Eha Tv
Next Story