ఆధునిక సమాజంలో ఇంకా అక్కడ అక్కడ మూఢ నమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. మూఢ నమ్మకాలను(Superstitions) ఇంకా పట్టుకొని వేలాడుతూనే ఉన్నారు. సమాజమంతా సాంకేతిక రంగంలో దూసుకెళ్తుంటే.. కొంత మంది మాత్రం వాటిని వదలడం లేదు. భార్యపై(wife) అనుమానం పెంచుకున్న ఓ భర్త(Husband) వేడి నూనెలో(Hot Oil) చేతులు పెట్టి తన ప్రాతివత్యాన్ని నిరూపించుకోవాలని ఆదేశించాడు. ఇందుకు భార్య కూడా అంగీకరించింది. ఈ ఘటన చిత్తూరు(chittoor) జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా పూతలపట్టు(Puthalapattu) మండలంలోని తేనెపల్లి పంచాయతీ ఎస్టీ కాలనీలో(ST Colony) చోటు చేసుకుంది. స్థానిక ఎస్టీ కాలనీలో గుండయ్య(Gundaiah), గంగమ్మ(Gangamma) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో గుండయ్యకు భార్య గంగమ్మపై కొంతకాలంగా అనుమానం వస్తుంది. తన భార్యకు ఎవరితోనో వివాహేతర సంబంధం(Extra Matrial Affair) ఉందని అనుమానం కలుగుతోంది. దీంతో శీల పరీక్షకు పెట్టాలనుకున్నాడు. తమ కులంలో అనాదిగా వస్తున్న ఆచారాన్ని పెట్టాలని పంచాయితీ పెట్టాడు. ఆనాడు రాముడే సీతకు శీల పరీక్ష కోసం అగ్నిగుండంలో దిగాలని కోరాడు. తాను మాత్రం వేడి నూనెలో చేతులు పెట్టాలంటే తప్పేంటి అనుకున్నాడేమో... ప్రాతివత్యాన్ని నిరూపించుకోవడానికి వేడి నూనెలో చేతులు పెట్టాలని కోరాడు. భార్య కూడా తాను ఏ తప్పూ చేయలేదని.. వేడి నూనెలో చేతులు పెట్టి తన నిర్దోషితత్వాన్ని నిరూపించుకుంటానని చెప్పింది. వేడి నూనెలో చేతులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ ఉదంతంపై సమాచారం అందుకున్న పూతలపట్టు ఎంపీడీవో హుటాహుటిన ఘటనా స్థలికి వచ్చి మూఢాచారాన్ని అడ్డుకున్నారు.