హైదరాబాద్‌లో ప్రస్తుతం వేసవి వేడిగాలులు తీవ్రంగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ మార్కును అధిగమించాయి. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడం నగరవాసులకు సవాలుగా మారింది. గరిష్టంగా ఎల్‌బీ నగర్‌లో 41.3 డిగ్రీల సెల్సియస్, ఖైరతాబాద్‌లో 41.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మండుతున్న ఎండలు ఒక్క హైదరాబాద్‌కే పరిమితం కాలేదు.

Summer heat grips Hyderabad as mercury climbs above 41 degree celsius
హైదరాబాద్(Hyderabad)లో ప్రస్తుతం వేసవి వేడిగాలులు(Heatwave) తీవ్రంగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు(Temparatures) 41 డిగ్రీల సెల్సియస్ మార్కును అధిగమించాయి. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడం నగరవాసులకు సవాలుగా మారింది. గరిష్టంగా ఎల్‌బీ నగర్(LB Nagar)లో 41.3 డిగ్రీల సెల్సియస్, ఖైరతాబాద్(Khairathabad)లో 41.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మండుతున్న ఎండలు ఒక్క హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. సూర్యాపేట(Suryapet) జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రత 45.2 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. నల్గొండ(Nalgonda)లో కూడా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ రాష్ట్రం(Telangana State) అంతటా.. ఉష్ణోగ్రతలు స్థిరంగా 40 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటుతున్నాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) అంచనాల ప్రకారం.. మే 20, 2023 వరకు హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 38.4, 39.5 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. రుతుపవనాల రాక కొంచెం ఆలస్యం కావచ్చని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. దీంతో జూన్ 8 నుంచి 10వ తేదీలోపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మండుతున్న ఎండల నుంచి ఉపశమనం ఎలా లభిస్తుందా అని చూస్తున్నారు జనం.
