టీనేజ్ వయసులోనే ప్రేమలో పడ్డారు.. ఇంట్లో విషయం తెలియడంతో కుటుంబసభ్యులు మందలించారు. ఇక పెళ్లికి ఒప్పుకోరన్న ఆవేదనతో ఆ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం(Khammam) జిల్లాలో చోటుచేసుకుంది.

Teen Love Couple Sucide
టీనేజ్ వయసులోనే ప్రేమలో పడ్డారు.. ఇంట్లో విషయం తెలియడంతో కుటుంబసభ్యులు మందలించారు. ఇక పెళ్లికి ఒప్పుకోరన్న ఆవేదనతో ఆ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం(Khammam) జిల్లాలో చోటుచేసుకుంది. బోనకల్(Bonakal) మండలం రాపల్లి(Rapalli) చెందిన చింతల సుమంత్(Chinthala Sumanth)(18), బ్రాహ్మణపల్లికి చెందిన దారగాని ఐశ్వర్య(Aishwarya)(17) ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు.
సుమంత్ ట్రాక్టర్ డ్రైవర్‌గా బ్రాహ్మణపల్లిలో పనిచేసే సమయంలో ఐశ్వర్యతో పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ విషయం ఇద్దరి కుటుంబసభ్యులకు తెలియడంతో మందలించారు. దీంతో సుమంత్ ట్రాక్టర్ డ్రైవర్ పని మానేసి మూడునెలల క్రితం హైదరాబాద్ వెళ్లి ఓ ప్రైవేట్ కంపెనీలో చేరాడు. గత నెల 29న ఐశ్వర్య ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు బోనకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే, ఐశ్వర్య హైదరాబాద్‌లో ఉన్న సుమంత్ వద్దకు వెళ్లిందని తెలిసింది. ఇంట్లో పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని ఇద్దరూ కలిసి గురువారంరాత్రి వైరా రిజర్వాయర్ దగ్గరకు చేరుకుని ఓ చెట్టుకు ఉరేసుకున్నారు.
