భాగ్యనగరంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా మారిపోయాయి.. మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఉష్ణోగ్రతతో, ఉక్కపోతతో అల్లాడిన హైదరాబాద్‌ ప్రజలకు వర్షం స్వగతం పలికింది. ఒక్కసారిగా హైదరాబాద్‌ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. చాలా చోట్ల భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగళ్లు కూడా పడ్డాయి. తెలంగాణ హైకోర్టు(Telangana High Court) దగ్గర ఈదురుగాలులతో కూడిన వడగళ్లవాన పడింది. సంతోష్‌నగర్‌, బాలాపూర్‌, చార్మినార్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కర్మన్‌ఘాట్‌, రాజేంద్రనగర్‌, నాంపల్లి, ఖైరతాబాద్‌లో భారీ వర్షం కురిసింది.

భాగ్యనగరంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా మారిపోయాయి.. మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఉష్ణోగ్రతతో, ఉక్కపోతతో అల్లాడిన హైదరాబాద్‌ ప్రజలకు వర్షం స్వగతం పలికింది. ఒక్కసారిగా హైదరాబాద్‌ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. చాలా చోట్ల భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగళ్లు కూడా పడ్డాయి. తెలంగాణ హైకోర్టు(Telangana High Court) దగ్గర ఈదురుగాలులతో కూడిన వడగళ్లవాన పడింది. సంతోష్‌నగర్‌, బాలాపూర్‌, చార్మినార్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కర్మన్‌ఘాట్‌, రాజేంద్రనగర్‌, నాంపల్లి, ఖైరతాబాద్‌లో భారీ వర్షం కురిసింది. మరో మూడు రోజులు ఇదే ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉండబోతున్నాయని స్పష్టం చేసింది.

Updated On 17 April 2023 6:57 AM GMT
Ehatv

Ehatv

Next Story