తెలంగాణలో(Telangana) వీధి కుక్కల(stray dogs) బెడద ఎక్కువయ్యింది.

తెలంగాణలో(Telangana) వీధి కుక్కల(stray dogs) బెడద ఎక్కువయ్యింది. రోజూ ఏదో చోట కుక్కలు దాడి చేసి ప్రజలను గాయపరుస్తూ ఉన్నాయి. వీధికుక్కల దాడిలో చిన్నారులు చనిపోయిన ఘటనలు కూడా జరిగాయి. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారే కానీ మళ్లీ మళ్లీ జరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని హైకోర్టు(High court) తిట్టినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఓ కుక్క రెండు రోజు వ్యవధిలో 30 మందిని గాయపరచింది. పారిశుద్ధ్య విధులకు వెళుతున్న భాగ్య, విజయ్‌లను, సీనియర్‌ శానిటరీ సూపర్‌వైజర్‌ రమేశ్‌ను కుక్క తీవ్రంగా గాయపరచింది. అలాగే మామిళ్లవాడలో ఉంటున్న ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులపై కూడా దాడి చేసింది. చిన్న పిల్లలను ఇంటి బయటకు పంపడానికి పేరంట్స్‌ భయపడుతున్నారు. పెద్దలు కూడా భయంభయంగానే తిరుగుతున్నారు.

Eha Tv

Eha Tv

Next Story