నాచారం పోలీస్ స్టేష‌న్‌ పరిధి మల్లాపూర్‌లోని ఓ ఏటీఎంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎంలో డ‌బ్బులు డ్రా చెద్దామ‌ని వెళ్లిన వ్య‌క్తులు ఒక్క‌సారిగా అవాక్క‌య్యారు. తాము డ్రా చేయాల‌నుకుని.. ఎంట‌ర్ చేసిన‌ డ‌బ్బుల కంటే త‌క్కువ రావ‌డంతో కంగుతిన్నారు.

నాచారం(Nacharam) పోలీస్ స్టేష‌న్‌ పరిధి మల్లాపూర్‌(Mallapur)లోని ఓ ఏటీఎం(ATM)లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎం(HDFC ATM)లో డ‌బ్బులు డ్రా చెద్దామ‌ని వెళ్లిన వ్య‌క్తులు ఒక్క‌సారిగా అవాక్క‌య్యారు. తాము డ్రా చేయాల‌నుకుని.. ఎంట‌ర్ చేసిన‌ డ‌బ్బుల కంటే త‌క్కువ రావ‌డంతో కంగుతిన్నారు. ఓ వ్య‌క్తి 1000 రూపాయలు నగదు డ్రా చేయాల‌నుకుని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయ‌గా.. అత‌నికి 1000కి బదులు 200 రావడంతో అవాక్కయ్యాడు. మెసేజ్ మాత్రం వెయ్యి డ్రా చేసిన‌ట్లుగా చూపిస్తుంది.

మ‌రో వ్య‌క్తి రూ.3000 నగదు కోసం వెళ్ళి విత్‌డ్రా చేయ‌బోగా.. అత‌నికి రూ. 600 వ‌చ్చాయి. ఇలా మ‌రికొద్ది మందికి కూడా జ‌రిగింది. దీనిపై టెక్నిషన్ ను అడగగా.. వినియోగదారులపై అత‌డు దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఏటీఎం వద్ద వినియోగదారుల ఆందోళనకు దిగారు. హెచ్‌డీఎఫ్‌సీ సిబ్బంది కాసేప‌టికి ఏటీఎం ను మూసివేశారు. క‌స్ట‌మ‌ర్ కేర్‌కు కాల్ చేసినా ఆదివారం కావ‌డంతో స్పందించ‌డం లేద‌ని వినియోగదారులు చెబుతున్నారు. డ‌బ్బులు మ‌ళ్లీ అకౌంట్‌ల‌లో జ‌మ అవుతాయో లేదో అని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Updated On 16 July 2023 3:10 AM GMT
Yagnik

Yagnik

Next Story