పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌(KTR) హామీ ఇచ్చారు. దక్షిణ భారత దేశంలోనే అతి పొడవైన స్టీల్ బ్రిడ్జ్‌ (Steel Bridge)(వీఎస్టీ-ఇందిరా పార్క్‌)ను మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చాక హైదరాబాద్‌లో ప్రారంభించిన ఫ్లైఓవర్లలో ఇది 36వదన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నాయిని నర్సింహారెడ్డి(Narsimha Reddy) పేరును ఈ స్టీల్‌ బ్రిడ్జ్‌కు పెట్టాలని సీఎం కేసీఆర్‌(CM KCR) ఆదేశించినట్లు చెప్పారు. లోయర్‌ ట్యాంక్‌ బండ్‌, అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌ను కలిపి అద్భుతంగా మారుస్తామని తెలిపారు.

ఇందిరా పార్కును(Indra Park) అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తమదని తెలంగాణ(Telangana) పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌(KTR) హామీ ఇచ్చారు. దక్షిణ భారత దేశంలోనే అతి పొడవైన స్టీల్ బ్రిడ్జ్‌ (Steel Bridge)(వీఎస్టీ-ఇందిరా పార్క్‌)ను మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చాక హైదరాబాద్‌లో ప్రారంభించిన ఫ్లైఓవర్లలో ఇది 36వదన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నాయిని నర్సింహారెడ్డి(Narsimha Reddy) పేరును ఈ స్టీల్‌ బ్రిడ్జ్‌కు పెట్టాలని సీఎం కేసీఆర్‌(CM KCR) ఆదేశించినట్లు చెప్పారు. లోయర్‌ ట్యాంక్‌ బండ్‌, అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌ను కలిపి అద్భుతంగా మారుస్తామని తెలిపారు. మరోవైపు, రాష్ట్రంలో కొంతమంది మతం పేరుతో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రతిపక్షాలకు 2023లోనే సినిమా చూపిస్తామన్నారు. రూ.450 కోట్ల వ్యయంతో మొత్తం 2.63 కి.మీల పొడవైన వీఎస్టీ-ఇందిరా పార్క్‌ వంతెనను రూ.450 కోట్ల వ్యయంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ) కింద జీహెచ్‌ఎంసీ నిర్మించింది. రాష్ట్రంలోనే తొలి సారిగా మెట్రో బ్రిడ్జిపై నుంచి స్టీల్‌ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ వల్ల ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ స్టీల్ ఫ్లై ఓవర్ (ఎలివేటెడ్ కారిడార్) వలన రవాణా సౌకర్యం మెరుగు పడుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ, హిందీ మహా విద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గుతుంది. ఇందిరా పార్క్, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ట్రాఫిక్ సమస్య లేకుండా బాగ్ లింగంపల్లి వీఎస్టీ జంక్షన్ వరకు సులభంగా వెళ్లొచ్చు.

రానున్న రోజుల్లో ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తాం: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సమైక్య పాలనలో నగరంలో ఏడాదికి వారం పది రోజులు కర్‌ఫ్యూలు ఉండేవన్నారు. అయితే స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలనలో శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పారు. పొరపాటు చేస్తే వందేండ్లు వెనక్కి వెళ్తుందన్నారు. కొందరు హైదరాబాద్‌లో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజల దశాబ్దాల కల నెరవేరిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో ఇది 36వ ఫ్లై ఓవరని చెప్పారు. నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టుకున్నామన్నారు. అదేవిధంగా స్టీల్‌ బ్రిడ్జికి నాయిని నర్సింహా రెడ్డి పేరు పెట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారన్నారు. 2001 నుంచి ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంట నిలిచారని వెల్లడించారు. దశాబ్దాలుగా కార్మిక నాయకుడిగా, రాష్ట్ర తొలి హోంమంత్రిగా పనిచేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఇందిరా పార్కును అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తమదని వెల్లడించారు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌, అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌ను కలిపి అద్భుతంగా మారుస్తామన్నారు. విశ్వనగరంగా హైదరాబాద్‌ ఎదగాలనే కలకు పునాది పడిందని చెప్పారు. కేసీఆర్‌ను హ్యాట్రిక్‌ సీఎంగా మళ్లీ కూర్చోబెట్టాలన్నారు. రానున్న రోజుల్లో ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తామని వెల్లడించారు.

Updated On 19 Aug 2023 6:04 AM GMT
Ehatv

Ehatv

Next Story