ఫార్మా కంపెనీలకు(Pharma company) వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా కొడంగల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల రైతులు ఆందోళనబాట పట్టారు.
కొడంగల్ నియోజకవర్గంలోని(Kondagal) లగచర్ల(Lagacharla) రైతుల(Farmers) ఆందోళనలు, కలెక్టర్, అధికారులపై దాడుల అంశాలు తెలంగాణ రాజకీయాలను(TS Politics) అట్టుడికిస్తున్నాయి. ఫార్మా కంపెనీలకు(Pharma company) వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా కొడంగల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల రైతులు ఆందోళనబాట పట్టారు. ఈ క్రమంలోనే ప్రజాభిప్రాయసేకరణతో అధికారులు ఆయా గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా లగచర్ల దగ్గరలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ రణరంగంగా మారింది. వికారాబాద్(Vikarabad) జిల్లా కలెక్టర్ అధికారి వెంకటరెడ్డి, అధికారులపై రైతులు తిరగబడ్డారు. పలు వాహనాలు ధ్వసం చేశారు. కడా అధికారి వెంకటరెడ్డిని చితకబాదారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆదే రోజు అర్ధరాత్రి ఊరుపై పోలీసులు దాడి చేశారు. ఊరికి వెళ్లే కరెంట్ కట్ చేసి ఇళ్ల మీద పడ్డారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని అక్కడి మహిళలే వాపోతున్నారు. ఇంట్లో ఉన్న మగవారినందరినీ తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ(Third degree) ప్రయోగించారని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికే దాదాపు 30-40 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ బాధితులకు అండగా నిలవడంతో ఆ పార్టీనే కుట్ర పన్ని అధికారులపై దాడికి ఉసిగొల్పిందని అధికారపార్టీకి చెందిన నేతలు ఆరోపించారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దాడి వెనుక నరేందర్‌రెడ్డి, కేటీఆర్ కుట్ర ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ ఆంధ్రజ్యోతి ఎడిటర్‌గా పనిచేసి రిటైరైన కె.శ్రీనివాస్ స్పందన ఇప్పుడు చర్చనీయాంశమైంది. రేవంత్‌రెడ్డికి మద్దతుగా నిలిచే ఆంధ్రజ్యోతి(Andhra Jyoti) పేపర్‌లో ఎడిటర్‌గా పనిచేసిన కె.శ్రీనివాస్(K.Srinivas) రైతులపై దాడిని ఖండిస్తూ సీఎం రేవంత్ వైఖరిని తప్పుబట్టేలా కామెంట్స్ చేశారు. ఫేస్ బుక్ వేదికగా రైతులపై దాడిని ఖండిస్తున్నట్లు ప్రకటించారు.