యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ(Giri pradakshina) మళ్లీ మొదలయ్యింది.
యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ(Giri pradakshina) మళ్లీ మొదలయ్యింది. యాదగిరీశుడి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారి గిరి ప్రదక్షిణను పునః ప్రారంభించారు. ఇందులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం కొండకింద గాలిగోపరం దగ్గర ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. దాదాపు రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసిన భక్తులు శ్రీవారి మెట్ల దారి నుంచి కొండపైకి చేరుకున్నారు. తర్వాత వారంతా ఉచిత దర్శనం క్యూలైన్‌లో ప్రధాన ఆలయంలోకి చేరుకున్నారు. స్వామిని దర్శించుకున్నారు. తెలంగాణలో గిరి ప్రదక్షిణను ప్రవేశపెట్టిన మొదటి ఆలయం యాదగిరి గుట్టనే కావడం విశేషం. భక్తులు గిరి ప్రదక్షిణ చేసి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం ఎప్పట్నుంచో ఉంది. అయితే 2016లో ఆలయాన్ని పునర్నిర్మించడంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ కారణంగా గిరి ప్రదక్షిణ ఇబ్బందిగా మారింది. ఇప్పుడు మళ్లీ ఆ సంప్రదాయం మొదలయ్యింది.