జూలై 3న గురు పూర్ణిమ సందర్భంగా తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ప్రత్యేక సూపర్ డీలక్స్ లగ్జరీ బస్సులను నడుపనుంది.

జూలై 3న గురు పూర్ణిమ(Guru Purnima) సందర్భంగా తమిళనాడు(Tamilnad)లోని అరుణాచల గిరి ప్రదక్షిణ(Arunachala Giri Pradakshina) కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ప్రత్యేక సూపర్ డీలక్స్ లగ్జరీ(Super Deluxe Luxury) బస్సులను నడుపనుంది. ప్రత్యేక బస్సు జూలై 2న ఉదయం 6 గంటలకు ఎంజీబీఎస్(MGBS) నుండి బయలుదేరి.. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని కాణిపాకం ఆలయం(Kanipakam Temple)లో దర్శనం అనంత‌రం.. రాత్రి 10 గంటలకు అరుణాచలం(Arunachalam) చేరుకుంటుంది. గిరి ప్రదక్షిణ అనంతరం బస్సు జూలై 3న మధ్యాహ్నం 3 గంటలకు వేలూరు(Vellore)లోని గోల్డెన్ టెంపుల్‌(Golden Temple)కు చేరుకుని, జూలై 4న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌(Hyderabad)కు తిరిగి వస్తుంది.

ప్యాకేజీ టూర్‌కు ఒక్కొక్కరికి రూ. 2,600 గా నిర్ణ‌యించింది టీఎస్ఆర్టీసీ. ఆసక్తి ఉన్నవారు www.tsrtconline.in వెబ్‌సైట్‌లో లేదా ఎంజీబీఎస్, జేబీఎస్‌(JBS), దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్(Dilshukh Nagar) లేదా సమీపంలోని టీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్‌(TSRTC Reservation Counter)లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 9959226257,9959224911 నంబర్‌లను కూడా సంప్రదించవచ్చ‌ని టీఎస్ఆర్టీసీ వెల్ల‌డించింది.

Updated On 25 Jun 2023 8:59 PM GMT
Yagnik

Yagnik

Next Story