హనుమకొండ జిల్లా(Hanumakonda District) హసన్‌పర్తి మండలం సీతంపేట గ్రామంలో దీపావళి(Diwali) బతుకమ్మ)Bathukamma) సంబరాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా ఇక్కడ బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నేతకాని కులానికి చెందిన వారు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
హనుమకొండ జిల్లా(Hanumakonda District) హసన్‌పర్తి మండలం సీతంపేట గ్రామంలో దీపావళి(Diwali) బతుకమ్మ(Bathukamma) సంబరాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా ఇక్కడ బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నేతకాని కులానికి చెందిన వారు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. నేతకాని సామాజికవర్గానికి చెందిన మహిళలే కాకుండా పురుషులు కూడా బతుకమ్మ ఎత్తడం ఆచారం.
సుమారు రెండువందల సంవత్సరాల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు చెరువు నుంచి మట్టిని సేకరించి దేవతల ప్రతిమలు తయారు చేస్తారు. వాటిని ఓ ప్రత్యేక గదిలో ప్రతిష్టించి పూజలు చేస్తారు. నైవేద్యాలు సమర్పిస్తారు.
రెండో రోజు దేవతల ప్రతిమలను పురుషులు భారీ ప్రదర్శనగా వెళ్లి స్థానిక చెరువులో నిమజ్జనం చేస్తారు. ఇందులో జోడెద్దుల మూర్తులే ఎక్కువగా ఉంటాయి. తర్వాత దీక్ష విరమిస్తారు. అటు పిమ్మట చెరువు నుంచి నీటిని తీసుకొచ్చి ప్రత్యేక గదిలో ఉంచి పూజలు చేస్తారు. పురుషులు కేదారేశ్వరస్వామి వ్రతాన్ని(Kedareswara Vratham)ఆచరిస్తారు.
మూడో రోజు మహిళలు బతుకమ్మలను తయారు చేసి భారీ ఊరేగింపుగా బయలుదేరుతారు. మహిళలతో పాటు పురుషులు కూడా బతుకమ్మలను ఎత్తుకోవడం ఇక్కడి ఆచారం. సుమారు రెండు కిలోమీటర్ల వరకు ప్రదర్శన సాగుతుంది.