ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్‎రెడ్డి(Revanth Reddy) ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేశారు. అలాగే దివ్యాంగురాలైన రజనీకి ఉద్యోగం ఇస్తూ ఉత్తర్వులపై రేవంత్ రెడ్డి సంతకం చేశారు. దీంతో రేవంత్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలుచేసే దిశగా మొదటి అడుగు వేసిందని చెప్పాలి. ఈ సందర్భంగా కృతజ్ణత సభలో మాట్లాడుతూ..

తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress Govt) కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‎రెడ్డి(CM Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు, ప్రజల హర్షధ్వానాల మధ్య గవర్నర్ తమిళిసై(Tamilisai Soundararajan) రేవంత్‎రెడ్డితోపాటు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎల్బీ స్టేడియం(LB Stadium)లో అత్యంత వైభవంగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా(Sonia Gandhi), రాహుల్(Rahul Gandhi), ప్రియాంకగాంధీ(Priyanka Gandhi) హాజరయ్యారు. వీరితో పాటు కర్ణాటక సీఎం సిద్ధి రామయ్య(Kanataka CM Siddha Ramaiah ), హిమాచల్ ప్రదేశ్ సీఎంలతో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లతో(DK Shivakumar) పాటు పలువురు జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్‎రెడ్డి(Revanth Reddy) ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేశారు. అలాగే దివ్యాంగురాలైన రజనీకి ఉద్యోగం ఇస్తూ ఉత్తర్వులపై రేవంత్ రెడ్డి సంతకం చేశారు. దీంతో రేవంత్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలుచేసే దిశగా మొదటి అడుగు వేసిందని చెప్పాలి. ఈ సందర్భంగా కృతజ్ణత సభలో మాట్లాడుతూ.. దశాబ్దకాలం నుంచి అనేక ఇబ్బందులు పడ్డ తెలంగాణ ప్రజలు..ఉక్కు సంకల్పంతొ ప్రజా రాజ్యాన్ని తెచ్చుకున్నారన్నారని అన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు, రైతులకు, ఉద్యమకారులకు, నిరుద్యోగులకు, యువతకు మంచి జరుగుతుందన్నారు. సామాజిక న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నా... ప్రగతి భవన్ కు ఎప్పుడైనా వచ్చే వీలు కల్పిస్తున్నానని ఆయన తెలిపారు. ప్రజలు ప్రభుత్వంలో భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపు నిచ్చారు. రేపు ఉదయం 10గంటలకు జ్యోతిరావుపూలే ప్రజాభవన్ లో ప్రజాదర్భార్ నిర్వహిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు.

ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల ప్రొఫైల్ః

మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka): 1961, జూన్‌ 15న జన్మించారు. నిజాం కాలేజీలో డిగ్రీ, HCUలో పీజీ పూర్తి చేశారు. 2009లో తొలిసారిగా మదిర నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009-11 మధ్య ఉమ్మడి ఏపీ చీఫ్‌విప్‌గా ఎన్నికయ్యారు. 2011-2014 మధ్య ఉమ్మడి ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. 2009023 మధ్య భట్టి విక్రమార్క మదిరలో నాలుగు సార్లు ఎన్నికల్లో విజయం సాధించారు.

ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy): ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి 1962 జూన్‌ 20న జన్మించారు. బీఎస్సీ గ్రాడ్యుయేట్‌ ఇండియన్‌ ఫోర్స్‌ మాజీ పైలట్‌. 1999-2009 మధ్య కోదాడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 వరకు ఉమ్మడి ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2015-2021 మధ్య తెలంగాణ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు ఉత్తమ్‌. 2009-2018 మధ్య హుజుర్‌నగర్‌ ఎమ్మెల్యేగా పని చేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా గెలుపొందారు. 2023లో మరోసారి హుజుర్‌‎నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha) : మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన దామోదర రాజనర్సింహ 1958, జనవరి 5న జన్మించారు. రాజనర్సింహ వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. 1989లో తొలిసారి ఆందోల్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా ఓటమిపాలయ్యారు. 2023లో మరోసారి ఆందోల్ నుంచి గెలుపొందారు.

దుద్దిళ్ల శ్రీధర్‎బాబు (D. Sridhar Babu) : దుద్దిళ్ల శ్రీధర్‎బాబు 1969 మార్చి 9న జన్మించారు. ఢిల్లీ యూనివర్శిటీలో విద్యాభ్యాసం చేశారు. 1999లో తొలిసారి మంథని నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2009 వరకు వరుసగా గెలుపొందారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో విప్ గా కూడా పని చేశారు. 2009-14లో మంత్రిగా కీలక శాఖలను నిర్వహించారు. 2014లో ఓడిపోయిన శ్రీధర్‎బాబు..2018, 2023 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2022 నుంచి టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సీతక్క(Seethakka)): మంత్రిగా బాధ్యతలు చేపట్టే సితక్క 1971, జూలై 9న జన్మించారు. 1988లో 10వ తరగతిలోనే నక్సల్స్‌ పార్టీలో చేరారు. జన నాట్య మండలి ద్వారా ఆదివాసీల సమస్యలపై పోరాటం చేశారు. 2 దశాబ్దాల పాటు కామ్రేడ్‌గా వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు సీతక్క. ఎన్టీఆర్‌ పిలుపుతో జనజీవన స్రవంతిలోకి వచ్చారు. 2001లో లాయర్‌గా ప్రాక్టీస్‌ చేశారు. 2004లో ములుగు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో తొలిసారిగా ములుగు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లో ఓటమి, అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో మరోసారి ములుగు నుంచి గెలుపొందారు.

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komati Reddy Venkata Reddy): కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 1963 మే 23న జన్మించారు. యువజన కాంగ్రెస్‌ నాయకుడిగా రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2009-2014 మధ్య నల్గొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్‌, రోశయ్య, కిరణ్‌ కుమార్‌రెడ్డి కేబినెట్‎లలో మంత్రిగా పని చేశారు. 2011లో తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2018లో నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. 2019లో నల్గొండ ఎంపీగా గెలుపొందారు. 2023లో మరోసారి నల్గొండ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

పొంగులేటి శ్రీనివాస్‎రెడ్డి (Ponguleti Srinivasa Reddy) : 2014లో ఖమ్మం నుంచి వైయస్ఆర్ సీసీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరిపోయారు. 2023లో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2013లో పాలేరు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar): పొన్నం ప్రభాకర్1963 మే 23న జన్మించారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1987-91 మధ్య NSUI జిల్లా కార్యదర్శిగా పని చేశారు. 1999-2002 వరకు NSUI అధ్యక్షుడిగా పని చేశారు. 2002-2003 మధ్య యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2009లో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు. 2014లో కరీంనగర్ ఎంపీ స్థానంలో ఓటమి పాలయ్యరు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి..ఓటమి పొందారు. 2023లో హుస్నాబాద్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

కొండా సురేఖ (Konda Surekha) : 1965, ఆగస్టు 19న జన్మించారు. 1995లో మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నియ్యారు. 1999-2004 ఎన్నికల్లో శాయంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో పరకాల నుంచి గెలుపొంది..వైఎస్ కేబినెట్ లో స్థానం సంపాదించుకున్నారు. 2011లో కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కొండా సురేఖ..2014లో బీఆర్ఎస్ తరఫున వరంగల్ తూర్పు నుంచి గెలుపొందారు. 2018లో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023లో వరంగల్ తూర్పు నుంచి మరోసారి విజయం సాధించారు.

తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao): 1953, నవంబర్ 15న జన్మించారు. 1982లో టీడీపీలో చేరారు. 1985, 1994, 1999, 2009, 2016 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన తుమ్మల..ఖమ్మం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

జూపల్లి కృష్ణారావుః(Jupally Krishna Rao) : 1955, ఆగస్టు 10న జన్మించారు. 1999-2014 మధ్య కొల్లాపూర్‎లో వరుస విజయాలు సాధించారు. వైఎస్ కేబినెట్ లో మంత్రిగా అవకాశం దక్కింది. 2011లో బీఆర్ఎస్ లో చేరారు. 2014లో తెలంగాణ తొలి కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. 2018 ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2022లో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి మరోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

Updated On 7 Dec 2023 5:51 AM GMT
Ehatv

Ehatv

Next Story