ప్రణీత్ రావును హైదరాబాద్‌కు తరలించారు. ఎస్‌ఐబీ లో విధుల దుర్వినియోగం, అనధికారిక
ఎస్‌ఐబీలో ఎలక్ట్రానిక్ పరికరాల డేటాను ధ్వంసం చేశారన్న ఆరోపణలపై స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబి) మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్‌పి) డి ప్రణీత్ రావుపై క్రిమినల్ కేసు నమోదైన మూడు రోజుల తర్వాత అదుపులోకి తీసుకున్నారు. సస్పెండ్ అయిన అధికారిని పంజాగుట్ట పోలీసులు మంగళవారం అర్థరాత్రి రాజన్న-సిరిసిల్ల జిల్లాలో అతని నివాసం నుండి అదుపులోకి తీసుకున్నారు.
ప్రణీత్ రావును హైదరాబాద్‌కు తరలించారు. ఎస్‌ఐబీ లో విధుల దుర్వినియోగం, అనధికారిక ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని ప్రణీత్‌రావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రణీత్‌రావు డిసెంబర్ 4న కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లను కాల్చివేశారంటూ ఎస్‌బీఐ అదనపు ఎస్పీ డి.రమేశ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఆయనపై ఐపీసీ, పీడీపీపీ, ఐటీ చట్టాల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రణీత్‌రావును అరెస్టు చేసేందుకు సోమవారమే పంజాగుట్ట పోలీసుల బృందం సిరిసిల్లకు చేరుకున్నారు. స్థానిక శ్రీనగర్ కాలనీలోనే ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఆయనను అరెస్టు చేశామని మంగళవారం రాత్రి పోలీసులు ప్రకటించారు.