వాతావరణ శాఖ(Meterological Department) చల్లని కబురు చెప్పింది. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు ఈ ఉదయం కేరళ తీరాన్ని తాకాయి. కేరళ(Kerala), దక్షిణ తమిళనాడు(Tamil Nadu), అరేబియా సముద్రం(Arabian sea), లక్షద్వీప్‌, వాయువ్య, ఈశాన్య బంగాళాఖాతంలోకి విస్తరించినట్టు వాతావరణశాక కేంద్రం ప్రకటించింది.

వాతావరణ శాఖ(Meteorological Department) చల్లని కబురు చెప్పింది. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు ఈ ఉదయం కేరళ తీరాన్ని తాకాయి. కేరళ(Kerala), దక్షిణ తమిళనాడు(Tamil Nadu), అరేబియా సముద్రం(Arabian sea), లక్షద్వీప్‌, వాయువ్య, ఈశాన్య బంగాళాఖాతంలోకి విస్తరించినట్టు వాతావరణశాక కేంద్రం ప్రకటించింది.

అయితే నైరుతి రుతుపవనాల రాక ఇప్పటికే ఆరు రోజులు ఆలస్యమైంది. సాధారణంగా రుతుపవనాలు ఏటా జూన్‌ 1న కేరళలోకి ప్రవేశిస్తాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను కారణంగానే నైరుతి రుతుపవనాలు రాక ఆలస్యమైనట్టు స్కైమెట్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్టు భారత వాతావరణశాఖ చేసిన ప్రకటన సాంత్వన కలిగించింది. గతేడాది మే 29 కేరళను తాకకగా.. 2021లో జూన్‌ 3న, 2020లో జూన్‌ 1న, 2019లో జూన్‌ 8, 2018లో మే 29న నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఈ ఏడాది వారం రోజులు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. రుతుపవనాల ఆలస్యానికి వాతావరణ మార్పులే కారణమని తెలుస్తోంది. తొలుత జూన్‌ 4 నాటికి తీరం తాకొచ్చని అంచనా వేసినప్పటికీ, రుతుపవనాల జాడ కనిపించలేదు. ఎట్టకేలకు గురువారం ఉదయం రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఈ రుతుపవనాల ఆలస్యంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈసారి వర్షపాతం కనీసం 5 శాతం దాకా తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.

నైరుతి రుతుపవనాలు భారత వ్యవసాయ రంగానికి కీలకం. సాగు విస్తీర్ణంలో 52శాతం వాటిపై ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో విద్యుత్‌ ఉత్పత్తితో పాటు తాగునీటికి సైతం రుతుపవనాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉన్నది. నైరుతి రుతుపవాలు కేరళ తీరాన్ని తాకాయన్న వార్త రైతన్నలకు ఆందనందాన్ని అందించే కబురే. ఇప్పటికే దుక్కులు దున్ని వరుణుడి కోసం ఎదురు చూస్తున్న రైతులకు భారతవాతావరణశాఖ తీపి కబురు పంపింది. అయితే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకడానికి మరో నాలుగు రోజులుపడుతుందని వాతావరణశాఖ తెలిపింది.

Updated On 8 Jun 2023 1:58 AM GMT
Ehatv

Ehatv

Next Story