తెలంగాణలో(Telangana) ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly elections) విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ(Congress Party) దూకుడుగా వ్యవహరిస్తోంది. మరో రెండు, మూడు నెలలలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో(Loksabha Election) కూడా ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌ను(BRS) మట్టికరిపించడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో పీపుల్స్‌పల్స్- సౌత్‌ఫస్ట్ సంస్థలు సంయుక్తంగా లోక్‌సభ ఎన్నికల కోసం ట్రాకర్ పోల్ సర్వేను(Tracker poll Survey) నిర్వహించింది. ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా కనిపించింది.
తెలంగాణలో(Telangana) ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly elections) విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ(Congress Party) దూకుడుగా వ్యవహరిస్తోంది. మరో రెండు, మూడు నెలలలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో(Loksabha Election) కూడా ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌ను(BRS) మట్టికరిపించడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో పీపుల్స్‌పల్స్- సౌత్‌ఫస్ట్ సంస్థలు సంయుక్తంగా లోక్‌సభ ఎన్నికల కోసం ట్రాకర్ పోల్ సర్వేను(Tracker poll Survey) నిర్వహించింది. ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ 8 నుంచి 10 లోక్‌సభ స్థానాలు గెల్చుకునే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్ పార్టీకి మూడు నుంచి అయిదు లోక్‌సభ స్థానాలు రావచ్చట! ఇక బీజేపీకి రెండు నుంచి నాలుగు లోక్‌సభ స్థానాలు వచ్చే అవకాశం ఉందని పీపుల్స్‌పల్స్- సౌత్‌ఫస్ట్ సర్వేలో తేలింది. కాంగ్రెస్ పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చే ఛాన్సుంటే, బీఆర్‌ఎస్‌కు 31 శాతం ఓట్లు వస్తాయని పీపుల్స్‌పల్స్- సౌత్‌ఫస్ట్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. బీజేపీ తన ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుంది. ప్రస్తుతం ఆ పార్టీకి 23 శాతం ఓట్లు రావచ్చని సర్వే చెబుతోంది. ఇతరులకు 6 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందట! నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం ఒకటి పెరిగింది. అలాగే బీజేపీకి(BJP) తొమ్మిది శాతం ఓట్లు ఎక్కువగా వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన పరిణామం ఏమిటంటే ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ ఆరు శాతం ఓట్లను కోల్పోవడం. కాంగ్రెస్ పార్టీకి మహిళల్లో ఎక్కువ మద్దతు ఉన్నట్లు పీపుల్స్‌పల్స్ - సౌత్‌ఫస్ట్ సర్వేలో తేలింది. పీపుల్స్‌పల్స్- సౌత్‌ఫస్ట్ సంస్థలు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలపై 11 ఫిబ్రవరి నుండి 17 ఫిబ్రవరి వరకు ట్రాకర్ పోల్ సర్వేను నిర్వహించింది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ట్రాకర్ పోల్ సర్వే కోసం ప్రతీ లోక్‌సభ నియోజకవర్గంలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో 4600 శాంపిల్స్‌తో ఈ సర్వే నిర్వహించారు.