జాలిగుండె లేని కొడుకుకన్నా కుక్క మేలురా అన్నరో సినీ కవి! ఇలాంటి కొడుకులను కనిపెంచడం దండగ!

జాలిగుండె లేని కొడుకుకన్నా కుక్క మేలురా అన్నరో సినీ కవి! ఇలాంటి కొడుకులను కనిపెంచడం దండగ! ఇలాంటి దౌర్భాగ్యపు కొడుకు ఒకడు అనారోగ్యానికి గురైన కన్నతల్లిని ఆసుపత్రికి తీసుకెళుతూ మార్గ మధ్యంలో నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. పాపం ఆ తల్లి కొడుకు కోసం రెండు రోజులు ఎదురుచూసింది. ఆకలితో(strav) అలమటించింది. గుండెపగిలి చనిపోయింది. కంటతడి పెట్టించే ఈ సంఘటన హైదరాబాద్‌ బోయినపల్లి(bowenpally) పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ నెల 5వ తేదీన మేడ్చల్‌లో(Medchal) ఉంటున్న అరవింద్‌ అనే వ్యక్తి అనారోగ్యంతో ఉన్న తల్లి శ్యామల (60)ను తీసుకుని హాస్పిటల్‌కు బయలుదేరాడు. బోయినపల్లి చెక్‌పోస్ట్‌ సమీపంలోని ఎంఎంఆర్‌ గార్డెన్‌(MMR garden) దగ్గర ఆమెను ఫుట్‌పాత్‌పై వదిలేసి వెళ్లిపోయాడు. కొడుకు వస్తాడు, తనను తీసుకెళతాడన్న పిచ్చి నమ్మకంతో ఆమె ఎదురుచూసింది. రెండు రోజులైనా కొడుకు జాడ లేదు. పాపం ఆకలితో ఆ తల్లి అలమటించింది. నీరసంతో స్పృహతప్పి పడిపోయింది. స్థానికులు సమాచారం మేరకు బోయినపల్లి పోలీసులు వచ్చి 108 అంబులెన్స్‌ సాయంతో ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల కిందట కాస్త కోలుకున్న శ్యామల నుంచి పోలీసులు వివరాలు రాబట్టారు. కొడుకును చూడాలని ఉందని శ్యామల చెప్పడంతో పోలీసులు అతడి కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం శ్యామల కన్నుమూసింది. ఆమె కొడుకు అరవింద్ కోసం మేడ్చల్ అంతా గాలించినా ఆచూకీ దొరకలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్యామల మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. శ్యామల గురించి తెలిసిన వారు బోయిన్‌పల్లి పోలీసులను సంప్రదించాలి.

Eha Tv

Eha Tv

Next Story