ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్(Software Engeneering) సెలవురోజును క్రికెట్‌తో(Cricket) ఎంజాయ్ చేయాలనుకున్నాడు. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతూ తలనొప్పిగా ఉందని విశ్రాంతి తీసుకున్న సమయంలోనే గుండెపోటు(Heart attack) వచ్చి మృత్యువాత పడ్డాడు.

Sanjay Bhargav
ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్(Software Engeneering) సెలవురోజును క్రికెట్‌తో(Cricket) ఎంజాయ్ చేయాలనుకున్నాడు. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతూ తలనొప్పిగా ఉందని విశ్రాంతి తీసుకున్న సమయంలోనే గుండెపోటు(Heart attack) వచ్చి మృత్యువాత పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ జిల్లా పెద్దగంట్యాడ మండలం మీంది గ్రామానికి చెందిన యువకుడు సంజయ్ భార్గవ్(Sanjay bhargav) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గచ్చిబౌలిలోని ఓ హాస్టల్‌లో ఉంటూ టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీకెండ్ కావడంతో క్రికెట్ ఆడాలని అనుకున్నాడు. దీంతో స్నేహితులు దిలీప్, అజయ్, ఆదిత్య, బాలప్రదీప్, తేజకిరణ్‌తో కలిసి ఘట్టుపల్లిలో కేసీఆర్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఆడుతున్నాడు. క్రికెట్ ఆడుతుండగా మధ్యలో తలనొప్పి ఉందని ఆట నుంచి తప్పుకొని విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సమయంలోనే కుప్పకూలాడు. వెంటనే ఫిట్స్ కూడా రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. భార్గవ్‌ను పరీక్షించిన వైద్యులు గుండెపోటు రావడంతో మరణించినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు భార్గవ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.
