ఓ యువతి(Woman) కొంతకాలంగా ఓ వ్యక్తితో సహజీవనం(Living together) చేస్తోంది. అతడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఫిబ్రవరి 12న వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. షాపింగ్, నగానట్రా అన్నీ కొనేసుకున్నారు. అనూహ్యంగా ఆదివారం తెల్లవారుజామున వధువు ఆత్మహత్య(Suicide) చేసుకుంది. బీహార్‌కు చెందిన అదితి భరద్వాజ్(Adithi baradhwaj) (34) కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడింది. అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది.

Software Attapur Incident
ఓ యువతి(Woman) కొంతకాలంగా ఓ వ్యక్తితో సహజీవనం(Living together) చేస్తోంది. అతడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఫిబ్రవరి 12న వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. షాపింగ్, నగానట్రా అన్నీ కొనేసుకున్నారు. అనూహ్యంగా ఆదివారం తెల్లవారుజామున వధువు ఆత్మహత్య(Suicide) చేసుకుంది. బీహార్‌కు చెందిన అదితి భరద్వాజ్(Adithi baradhwaj) (34) కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడింది. అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బీహార్‌కు చెందిన అదితి భరద్వాజ్(34) కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి స్థిరపడింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ గతంలో ఓ వ్యక్తిని వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. గత కొంతకాలంగా తన కొలీగ్ చింతల్‌మెట్‌కు చెందిన మహ్మద్‌అలీతో సహజీవనం చేస్తూ మణికొండలో నివాసం ఉంటోంది. ఆ తర్వాత అత్తాపూర్ ఠాణా పరిధిలోని హ్యాపీహోమ్స్ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని అందులో అదితిని మహ్మద్ అలీ ఉంచాడు. ఫిబ్రవరి 12న ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లగా అదితి భరద్వాజ్ గర్భం(Pregnant) దాల్చినట్లు వైద్యులు తెలిపారు. ఆ రోజు నుంచి మనస్తాపంతో ఉంది. దీంతో ఆమె ఆదివారం తెల్లవారుజామున మహ్మద్‌అలీకి ఫోన్‌చేసి తాను తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలిపింది. మహ్మద్ అలీ ఇంటికి చేరుకునేసరికే అదితి ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణం చెందింది. దీంతో అత్తాపూర్ పోలీసులకు మహ్మద్‌అలీ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.
