దుర్గంచెరువులో(Durgam cheruvu) దూకి బాలాజీ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్(software engeneer) ఆత్మహత్య(suicide) చేసుకున్నాడు.
దుర్గంచెరువులో(Durgam cheruvu) దూకి బాలాజీ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్(software engeneer) ఆత్మహత్య(suicide) చేసుకున్నాడు. ప్రేమించిన యువతి పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేయడంతో ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పలేక ఒత్తిడికి లోనయ్యి మాదాపూర్(Madhapur) దుర్గంచెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ముషీరాబాద్‌కు(Musheerabad) చెందిన 25 ఏళ్ల బాలాజీ మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈనెల 24న కూడా బాలాజీ ఆఫీస్ నుంచి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. బాలాజీకి ఫోన్ చేయగా అతని ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో ఈనెల 25న రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఐటీ కంపెనీలో పోలీసులు విచారించారు. ఈనెల 24న రాత్రి 8.30కి ఆఫీస్ నుంచి బయటకు వచ్చినట్లు తేలింది. సీసీ కెమెరాలను పరిశీలించగా మాదాపూర్ దుర్గంచెరువు బ్రిడ్జి మీది నుంచి దూకినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సిబ్బంది దుర్గంచెరువులో గాలించగా శుక్రవారం సాయంత్రం చెరువులో బాలాజీ మృతదేహం లభ్యమైంది. ఐడీ కార్డు ఆధారంగా బాలాజీ మృతదేహమేనని గుర్తించారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీయగా.. బాలాజీ ఓ యువతితో ప్రేమలో ఉన్నాడని.. ఆ యువతి పెళ్లి కోసం ఒత్తిడి చేయడంతో మానసికంగా ఒత్తిడికి గురయ్యాడు. ప్రేమవిషయం ఇంట్లో చెప్పలేక బాలాజీ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు.