Venu Swamy : బాబూ.. వేణుస్వామి ఎక్కడున్నాయ్యా..?
సోషల్ మీడియాలో(Social Media) ట్రోల్ అవ్వడం ఎలాగో బండ్ల గణేశ్(Bandla Ganesh), వేణుస్వామిలను(Venu swamy) అడిగితే బోల్డంత మ్యాటర్ దొరుకుతుంది. లాస్ట్‌టైమ్ తెలంగాణ ఎలెక్షన్లలో(TS elections) పాపం బండ్ల గణేశ్‌ను నెటిజన్లు ఫుట్‌బాల్ ఆడుకున్నారు. అయిదేళ్ల పాటు ఆడుతూనే వచ్చారు. ఆనాటి ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) కనుక గెలవకపోతే సెవనోక్లాక్ బ్లేడ్‌తో మెడ కోసుకుంటానంటూ బండ్ల గణేశ్ భీషణమైన ప్రతిజ్ఞ చేయడం, టీఆర్‌ఎస్(TRS) బ్రహ్మాండమైన విజయాన్ని సాధించడంతో తూచ్..
బీఆర్‌ఎస్ క్యాడర్ ప్లస్ బెట్టింగ్ రాయుళ్లు నీ కోసం వెతుకుతున్నారు.
సోషల్ మీడియాలో(Social Media) ట్రోల్ అవ్వడం ఎలాగో బండ్ల గణేశ్(Bandla Ganesh), వేణుస్వామిలను(Venu swamy) అడిగితే బోల్డంత మ్యాటర్ దొరుకుతుంది. లాస్ట్‌టైమ్ తెలంగాణ ఎలెక్షన్లలో(TS elections) పాపం బండ్ల గణేశ్‌ను నెటిజన్లు ఫుట్‌బాల్ ఆడుకున్నారు. అయిదేళ్ల పాటు ఆడుతూనే వచ్చారు. ఆనాటి ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) కనుక గెలవకపోతే సెవనోక్లాక్ బ్లేడ్‌తో మెడ కోసుకుంటానంటూ బండ్ల గణేశ్ భీషణమైన ప్రతిజ్ఞ చేయడం, టీఆర్‌ఎస్(TRS) బ్రహ్మాండమైన విజయాన్ని సాధించడంతో తూచ్.. ఇలాంటివి బోలెడంటాం! అని తప్పించుకున్నారు బండ్ల. అయితేనేం.. నెటిజన్లు మాత్రం ఊరుకోలేదు. కాంగ్రెస్ గెలిచేవరకు ట్రోల్(Trolls) చేస్తూనే వచ్చారు. ఇక ఇప్పుడు ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి దొరికారు. మిడతంబొట్ల బ్యాచ్‌లో ఈయన కాసింత అగ్రగణ్యుడు కాబట్టి స్వామివారు ఎక్కువ ట్రోల్ అవుతున్నారు. సోషల్ మీడియాలో అయితే గిరాగిరా తిరుగుతున్నారు కానీ బయటకు మాత్రం కనిపించడం లేదు. మిగతావారికి ఫేస్ వాల్యూ అంత లేదు కాబట్టే తప్పించుకున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో వారి దుమ్ము కూడా దులిపేస్తున్నారనుకోండి.. మళ్లీ జాతకరత్నం వేణుస్వామి విషయానికి వద్దాం.. ఎందుకో ఆయన మీద చాలా మందికి గురి ఉంది. ఆయన చెప్పేదంతా నిజమవుతుందనే నమ్మకం ఉంది. పొలిటిషియన్లు, సినీ సెలబ్రెటీల జాతకాలు(Astrology) చెప్పి చెప్పి ఆయనే ఓ సెలబ్రిటీ అయిపోయారు. ఎంతగా అంటే ఆయనతో సినిమా తారలు పూజలు చేయించుకునేంతగా! సెలబ్రిటీల పెళ్లిళ్లు, పెటాకుల గురించి స్వామి చెప్పినవి ఒకట్రెండు నిజాలయ్యాయి. దాంతో పాలిటిక్స్‌పై ఆయనేం చెప్పినా గట్టిగా నమ్మే సిట్యువేషన్ వచ్చేసింది. ఎన్నికలకు కొన్నాళ్ల ముందు ఆయనేం జోస్యం చెప్పారంటే .. బీఆర్‌ఎస్(BRS) ఘన విజయం సాధిస్తుందని, కేటీఆర్(KTR) సీఎం అవుతారని.. అది కూడా డైరెక్ట్‌గానేనని గ్రహగతులను అంచనా వేసి చెప్పారు. అష్టమంలో శని ఉంది... షష్టమంలో శని ఉందని ఏదేదో చెప్పారు. ఆయన మాటలు విన్న తెలంగాణ ప్రజలు ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూశారు. తీరా ఫలితాలు జోస్యాన్ని భిన్నంగా వచ్చాయి. బీఆర్‌ఎస్ క్యాడర్ ఇప్పుడు వేణుస్వామి కోసం వెతుకుతున్నారు. ఎక్కడైనా జాతకాలు చెబుతూ కనిపిస్తాడేమోనని గాలిస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్లు కూడా కారాలు మిరియాలు నూరిన రోకలిపుచ్చుకుని వేణుస్వామి కోసం తిరుగుతున్నారు. ఆయన్ను నమ్ముకుని సర్వమంగళం పాడేసుకున్నామని వాపోతున్నారు. కొందరైతే తమ చెప్పుతో తామే కొట్టేసుకుంటున్నారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా... తన జాతకం తప్పైతే ఇక జన్మలో జాతకాలు చెప్పనని గాట్టిగా ఒట్టేసుకున్నారు.. ఇప్పుడు ఒట్టు తీసి గట్టుమీద పెడతారా? ఇచ్చిన మాట ప్రకారం జోస్యాల జోలికి వెళ్లకుండా మరో వృత్తిని ఎంచుకుంటారా? కొసమెరుపేమిటంటే .. వచ్చే మూడు టర్ములు రేవంత్‌రెడ్డినే సీఎంగా ఉంటారట! ఇది లేటెస్ట్‌గా వేణుస్వామి నోటి నుంచి వచ్చిన మాట!