తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. దీంతో ప‌లువురు ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌కు స్థాన‌చ‌ల‌నం క‌లుగుతుంది. అలాగే టీఎస్‌పీఎస్సీ ఛైర్మ‌న్ జ‌నార్ధ‌న్ రెడ్డి లాంటి అధికారి ఐయితే ఏకంగా రాజీనామానే చేశారు.

తెలంగాణ‌(Telangana)లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం(Congress Govt) అధికారంలోకి వ‌చ్చింది. దీంతో ప‌లువురు ఐఏఎస్‌(IAS), ఐపీఎస్(IPS) అధికారుల‌కు స్థాన‌చ‌ల‌నం క‌లుగుతుంది. అలాగే టీఎస్‌పీఎస్సీ ఛైర్మ‌న్ జ‌నార్ధ‌న్ రెడ్డి(TSPSC Chairman Janardhan Reddy) లాంటి అధికారి ఐయితే ఏకంగా రాజీనామానే చేశారు. అయితే.. గ‌త ప్ర‌భుత్వంలో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హించిన ఐఏఎస్ అధికారిణి స్మితా స‌బ‌ర్వాల్(Smita Sabharwal) డిప్యుటేష‌న్‌(Deputation)పై కేంద్రానికి వెళ్తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ ప్ర‌చారాన్ని ఆమె సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ 'ఎక్స్' వేదిక‌గా ఖండించారు.

ఆమె ట్వీట్‌లో.. నేను సెంట్రల్ డిప్యుటేషన్‌కి వెళ్తున్నానని కొన్ని వార్తా ఛానెల్‌లు ఫేక్ న్యూస్ రిపోర్ట్ చేయడం చూశాను. ఈ వార్త‌ విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఇది పూర్తిగా అబద్ధం, నిరాధారం. తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిగా.. తెలంగాణ ప్రభుత్వం నాకు తగినదిగా భావించి అప్ప‌గించే ఏ బాధ్యతనైనా నేను నిర్వహిస్తాను.. కొనసాగుతాను. నా రాష్ట్ర ప్రయాణంలో భాగమైనందుకు గర్విస్తున్నానని రాసుకొచ్చారు.

Updated On 13 Dec 2023 9:09 PM
Yagnik

Yagnik

Next Story