భద్రాచలంలో(Bhadrachalam) సీతారాములకల్యాణోత్సవం(Sitaram Kalyanotsavam) వైభవంగా జరుగుతుంటుంది. శ్రీరామనవమి(sriramanavami) రోజున భద్రాచలం వెళ్లడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఆ ఆసక్తి భక్తితో కూడినది! బుధవారం జరగనున్న సీతారాముల కల్యాణానికి భద్రాచలం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. ఉత్సవాలలో భాగంగా ఇవాళ ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది.
భద్రాచలంలో(Bhadrachalam) సీతారాములకల్యాణోత్సవం(Sitaram Kalyanotsavam) వైభవంగా జరుగుతుంటుంది. శ్రీరామనవమి(sriramanavami) రోజున భద్రాచలం వెళ్లడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఆ ఆసక్తి భక్తితో కూడినది! బుధవారం జరగనున్న సీతారాముల కల్యాణానికి భద్రాచలం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. ఉత్సవాలలో భాగంగా ఇవాళ ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది. రామాలయం ఉత్తర ద్వారం దగ్గర ఈ ఎదుర్కోలు ఉత్సవాన్ని(Edurkolu event) నిర్వహిస్తారు. ఇక సీతారాముల కల్యాణం కోసం మిథిలా స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకను ప్రత్యక్షంగా చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివస్తారు. భక్తులను దృష్టిలో పెట్టుకొని అన్నిరకాల సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయానికి రంగులు, విద్యుత్ వెలుగులతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ పంచవటిలో ఉన్న సీతారాములు, లక్ష్మణ, రావణాసురుడు విగ్రహాలకు రంగులు వేశారు. గురువారం శ్రీ రామ పట్టాభిషేకం జరగనుంది. భద్రాచల రాముడిని భోగా రాముడిని, దుమ్ముగూడెం రాముడిని ఆత్మ రాముడని, పర్ణశాల రాముడిని శ్లోక రాముడిని అంటారు. రామాయణ కావ్యంలో వీరికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పర్ణశాల పుణ్యక్షేత్రంలో సీతారాముల వారు 14 ఏళ్లు అరణ్యవాసం చేశారని అంటారు. భద్రాచల రాముడిని దర్శించుకున్న భక్తులు పర్ణశాల రామయ్యను దర్శించుకొని పరవశించిపోతుంటారు. ఇక భక్తుల కోసం తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లతోపాటు చలువ పందిళ్లు వేశారు. స్వామివారి కల్యాణ వేడుకలు వీక్షించేందుకు మొత్తం 24 సెక్టార్లు ఏర్పాటు చేశారు. ప్రతి సెక్టార్‌లో ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేశారు.