తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు సాయిచంద్ గుండెపోటుతో మ‌ర‌ణించారు. సాయిచంద్ వ‌య‌సు 39 సంవ‌త్స‌రాలు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీల‌క‌మైన భూమిక‌ను పోషించిన‌ సాయిచంద్‌.. ప్ర‌స్తుతం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్నారు.

తెలంగాణ(Telangana) ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు సాయిచంద్(Sai Chand) గుండెపోటుతో మ‌ర‌ణించారు. సాయిచంద్ వ‌య‌సు 39 సంవ‌త్స‌రాలు. తెలంగాణ ఉద్యమం(Telangana Movement)లో ఎంతో కీల‌క‌మైన భూమిక‌ను పోషించిన‌ సాయిచంద్‌.. ప్ర‌స్తుతం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌(Telangama State Warehouse Corporation Chairman)గా ఉన్నారు. బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్(Nagarkurnool) జిల్లా కారుకొండ(Karukonda)లోని తన ఫామ్‌హౌస్‌(Farm House)కు వెళ్లిన సాయిచంద్‌.. అక్క‌డ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. అర్ధరాత్రి వేళ గుండెపోటు(Heart Attcak) రావడంతో కుటుంబ స‌భ్యులు చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌లోని ఓ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌(Hyderabad) గచ్చిబౌలి(Gachibowli)లోని కేర్‌ హాస్పిటల్‌(Care Hospital)కు తరలించారు. అక్క‌డ‌ చికిత్స పొందుతూ సాయిచంద్‌ కన్నుమూశారు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఆయ‌న గ‌ళం నుంచి జాలువారిన.. రాతి బొమ్మ‌ల్లోన కొలువైన శివుడా.. ర‌క్త బంధం విలువ నీకు తెలియ‌దు రా.. అనే పాట ఉద్య‌మం స‌మ‌యంలో మార్మోగింది.

సాయిచంద్ మృతిపట్ల సీఎం కేసీఆర్‌(CM KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. చిన్న వయస్సులో సాయిచంద్‌ మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఆయన మరణంతో తెలంగాణ గొప్ప గాయకున్ని, కళాకారున్ని కోల్పోయిందన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్‌ అని అన్నారు. ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని తెలిపారు. రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్‌ పాత్ర అజరామరంగా నిలుస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో సాయిచంద్‌ పాడిన పాటలను, చేసిన సాంస్కృతిక ఉద్యమాన్ని ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. సాయిచంద్‌ కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియ‌జేశారు.

Updated On 28 Jun 2023 9:15 PM GMT
Yagnik

Yagnik

Next Story